తల్లికి వందనం కింద 15 వేలు GO విడుదల, ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

తల్లికి వందనం కింద 15 వేలు GO విడుదల, ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రస్తుతం తల్లికి వందనంగా సవరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవో ను విడుదల చేసింది.

గత ప్రభుత్వం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 15000 చెల్లిస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి 15000 చెల్లించడం జరుగుతుంది.ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆధార్ తప్పనిసరి

ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు తల్లికి వందనం కింద అమౌంట్ పొందాలంటే తప్పనిసరిగా వారికి ఆధార్ ఉండాలి.

ఆధార్ కార్డ్ ఒకవేళ విద్యార్థి పేరుతో లేకపోతే వెంటనే దరఖాస్తు చేసి దరఖాస్తు చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తో పాటు కింద ఇవ్వబడిన ఏదో ఒక ప్రూఫ్ ని జత చేయాల్సి ఉంటుంది.

బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, మేజర్ అయితే ఓటర్ కార్డ్, nrega కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా వ్యక్తిని గుర్తిస్తూ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ లేదా తాహసిల్దార్ జారీ చేసిన దృవ పత్రం అయినా ఉండాలి.

ప్రస్తుతం ఆధార్ కార్డు ఎన్రోల్ చేస్తుంటే నెలలోపే వస్తుంది కాబట్టి ఇప్పటినుంచే లబ్ధిదారులు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎక్కువ శాతం మంది మైనర్ పిల్లలే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ పిల్లలకు ఆధార్ కార్డుకి అప్లై చేయాల్సి ఉంటుంది.

75% హాజరు తప్పనిసరి

గత ప్రభుత్వం మాదిరి గానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ పథకం కింద నగదు పొందాలంటే తప్పనిసరిగా 75% హాజరు ఉండాలని నిబంధన ను కొనసాగించడం జరిగింది.

పైన పేర్కొన్నటువంటి అర్హతలను తల్లికి వందనం పథకం తో పాటు విద్యా కానుక స్టూడెంట్ కిట్స్ పథకానికి కూడా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Talliki Vandanam

You cannot copy content of this page