దేశవ్యాప్తంగా 16 వ విడత PM కిసాన్ సంబంధించి రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి నెల వస్తున్నా ఇంకా PM కిసాన్ జమ కాలేదు. ఈ నేపథ్యంలో అసలు పిఎం కిసాన్ ఎప్పుడు పడుతుంది , ఎప్పటి లాగా ఈకెవైసి చేయించుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈసారి 16 వ విడత పిఎం కిసాన్ ఎప్పుడు పడుతుంది?
జనవరి లేదా ఫిబ్రవరిలో జమ కావాల్సి ఉన్న ఉన్నటువంటి pm కిసాన్ సహాయం వచ్చే నెల అనగా మార్చ్ 2024 తొలి వారం లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ముఖ్య గమనిక: అయితే ఈ విడత ఆంధ్ర ప్రదేశ్ లో రైతు భరోసా వాటా ఏమీ ఉండదు. కేవలం పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు మాత్రమే జమ కానున్నాయి. రైతు భరోసా వాటాగా మే నెలలో 5500 మరియు అక్టోబర్ నెలలో 2000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. వీటితో పాటుగా కేంద్రం ఇంచుమించు అదే నెలల్లో PM కిసాన్ నిధులు 2000 చప్పున జమ చేస్తుంది. PM కిసాన్ కింద కేంద్రం మొత్తం మూడు విడతల్లో 6000 విడుదల చేస్తుంటుంది.
ఇక తెలంగాణ రైతులకు, రైతు బంధు లేదా ప్రస్తుత ప్రభుత్వం అందించబోయే రైతు భరోసా కి అదనంగా ఏటా pm కిసాన్ జమ అవుతూ ఉంటుంది.
ఈ డేట్ లోపు ఈ కేవైసి పూర్తి చేసుకోండి
PM కిసాన్ అధికారిక వెబ్సైట్ లో గాని లేదా మీసేవ ద్వారా గానీ ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గత కొన్ని విడతలుగా పీఎం కిసాన్ నిధులు జమ చేస్తూ వస్తుంది. ఈసారి కూడా kyc పూర్తి అయిన వారికి మాత్రమే 16 వ విడత నిధులు జమ అవుతాయి.
ఆగస్ట్ 22 లాగా ఎవరైతే రైతులు ఇంకా ekyc పూర్తి చేయలేదో అటువంటి వారు వెంటనే మీ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్ ఉపయోగించి కింది లింక్ ద్వారా ఈకేవైసి పూర్తి చేయవచ్చు.
Click here for PM kisan ekyc link
PM Kisan status కోసం ఇక్కడ క్లిక్ చేయండి.