ఇక సచివాలయం లోనే పెన్షన్, ఈ ప్రూఫ్ తప్పనిసరి

ఇక సచివాలయం లోనే పెన్షన్, ఈ ప్రూఫ్ తప్పనిసరి

ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లను పెన్షన్ పంపిణీ మరియు ఇతర నగదు పంపిణీ నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

పెన్షన్ పంపిణీ విధి విధానాలు జారీ

సచివాలయాల సిబ్బందితో నే పెన్షన్ పంపిణీ

ఎన్నికల కోడ్ ముగిసే వరకు పెన్షన్ పంపిణీ సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. కోడ్ ముగిసే వరకు సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ పంపిణీ చేయించినట్లు తెలిపింది. అయితే ఇంటింటికి కాకుండా నేరుగా సచివాలయాలలోనే ఈ పెన్షన్ పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులను ఈసి స్వల్పంగా సవరించింది. దివ్యాంగులు, తీవ్ర మైన అనారోగ్యం ఉన్న వారికి ఇంటి వద్దనే సిబ్బంది తో పంపిణీ చేసేలా ఆదేశాలు ఇచ్చింది.

ఆధార్ లేదా ఏదైనా ఐడి  ప్రూఫ్ తో పెన్షన్

ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించి టెన్షన్ లబ్దిదారులు సచివాలయాలకు వెళ్లి ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించి తమ పెన్షన్ పొందవచ్చు.

వాలంటీర్లను ఎన్నికల విధులు మరియు పెన్షన్ పంపిణీ సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, వాలంటీర్లను నగదు పంపిణీకి దూరంగా ఉంచాలని హైకోర్టులో వేసిన పిటిషన్ నేపథ్యంలో ముందుగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత తాజాగా రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

You cannot copy content of this page