సదరం స్లాట్ బుకింగ్ లో మార్పులు… ఏమిటవి?

సదరం స్లాట్ బుకింగ్ లో మార్పులు… ఏమిటవి?

ప్రస్తుతం సచివాలయాలు, మీసేవ కేంద్రాల పరిధిలో సదరం స్లాట్ బుకింగ్ కొనసాగుతుంది. దివ్యాంగుల సౌలభ్యం కోసం సదరం స్లాట్ బుకింగ్ లో పలు మార్పులు చేర్పులు చేయడం జరిగింది.

దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మీ సేవ కేంద్రం నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ అందుబాటులో ఉంటే లబ్ధిదారులకి సంబంధిత సదరం క్యాంప్ వివరాలుతో రసీదు ఇవ్వడం జరుగుతుంది.

ఒకవేళ స్లాట్ గాని అందుబాటులో లేకపోతే ముందుగా వారి స్లాట్ అయితే బుక్ అవుతుంది తర్వాత క్రమ సంఖ్య అనుగుణంగా వారికి రసీదు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరికి సదరం క్యాంప్ నిర్వహణ ఆన్లైన్లో అప్డేట్ చేయగానే సంబంధిత లబ్ధిదారుని మొబైల్ కి ఎస్ఎంఎస్ ద్వారా క్యాంప్ ఏ రోజు, ఎక్కడ అనేది సమాచారం పంపించడం జరుగుతుంది.

ఎవరికైతే క్యాంప్ వివరాలు ఎస్ఎంఎస్ అందుతుందో అటువంటి వారు మాత్రమే క్యాంపు కి హాజరు కావాల్సి ఉంటుంది.ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా దివ్యాంగులకు తెలియజేయడం జరిగింది.

You cannot copy content of this page