SADAREM Application process
Latest update ✦ సదరెమ్ (SADAREM - Software for Assessment of Disabled for Access, Rehabilitation and Empowerment) ద్వారా దివ్యాంగులకు అక్టోబర్ నవంబర్ మరియు డిసెంబర్ సంబంధించి సదరం స్లాట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి New |
HELPLINE NUMBER
States Covered : Andhra Pradesh
Any grievance number : 1902
Agriculture & Allied Services1907
1. ఓల్డ్ సర్టిఫికెట్స్
( 2017 ఆగస్టు కి ముందువి మ్యాన్యువల్ సర్టిఫికెట్స్) ఈ సర్టిఫికెట్స్ డిలీషన్ కి డైరెక్టుగా సదరన్ క్యాంపు జరిగే హాస్పిటల్ నుండి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చును. గ్రీవెన్స్ ఆప్షన్ సదరం సైట్ లో ఉంటుంది. సదరం డిపార్ట్మెంట్ ఐడి స్టేటస్ చెక్ చేసి ఓల్డ్ సర్టిఫికెట్ అయితే కనుక అప్రూవల్ ఇచ్చి డిలీట్ చేస్తుంది. కొత్తగా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
2. టెంపరరీ సర్టిఫికెట్స్
డాక్టర్ గారు దివ్యాంగుడిని తనిఖీ చేసిన తరువాత భవిష్యత్తులో అతనికి తగ్గుతుంది అని అనిపిస్తే టెంపరరీ సర్టిఫికెట్స్ ఇవ్వబడును. ఆ సర్టిఫికెట్స్ కాలపరిమితి ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు ఇవ్వబడును. సర్టిఫికెట్ తేది గడువు పూర్తి అయిన తర్వాత హాస్పిటల్ నుండి గ్రీవెన్స్ పెట్టవచ్చును.
సదరం డిపార్ట్మెంట్ ఐడీ స్టేటస్ చెక్ చేసి తేది గడువు పూర్తి అయితే కనుక వెంటనే అప్రూవల్ వస్తుంది, వారు తిరిగి మరల స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
3. డైరెక్ట్ రిజెక్ట్ కేస్, అస్సెస్డ్ అండ్ రిజెక్ట్ కేస్ :
డాక్టర్ గారు దివ్యాంగుడిని తనిఖీ చేసిన తర్వాత తనకి ఉన్న వైకల్య శాతం ని నమోదు చేస్తారు. దాన్ని బట్టి ఆ సర్టిఫికెట్ పర్మినెంట్ లేక అసెస్మెంట్ తిరిగి రిజెక్ట్ అయిన కేసా అనేది తెలుస్తుంది.
40% శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే అవి పర్మినెంట్ సర్టిఫికెట్ పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతుంది.వైకల్య శాతం 40% కంటే తక్కువ ఉంటే గనుక అట్టి సర్టిఫికెట్ రిజెక్ట్ అయిన కేస్ అని అర్థం చేసుకోవాలి. ఈ వైకల్య శాతం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇస్తున్నారన్నది గుర్తించుకోవాలి.
అలాగే వైకల్య శాతం అనేది 40% శాతం కంటే ఎక్కువ ఉండి ఆ సదరన్ ఐడి టెంపరరీ సర్టిఫికెట్ అయితే కనుక వారు పెన్షన్ కి ఎలిజిబుల్ కారు.
4. అసెస్మెంట్ జరిగి రిజెక్ట్ అయిన కేసులు
( 40% కంటే తక్కువ పర్సంటేజీ వచ్చినవాళ్లు ), టెంపరరీ సర్టిఫికెట్స్ వాళ్లు మరలా తనిఖీకి అవకాశం పొందాలంటే వారు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో స్పందన కార్యక్రమాలు జరుగును. అక్కడ వాళ్లు అర్జీ ఇస్తే అక్కడ ఉన్న అధికారులు జిల్లాలోని ఏదో ఒక హాస్పిటల్ కి రిఫర్ చేస్తారు. అర్జీ ఇచ్చిన దివ్యాంగుడు ఆ హాస్పిటల్ కి వెళ్లి సంబంధిత
డాక్టర్ గారి దగ్గర ఒపి మీద తిరిగి తనిఖీ కి వెళ్ళాలి. డాక్టర్ గారు వారిని తనిఖీ చేసి వాళ్లు గనక ఎలిజిబుల్ అయితే గనుక ఆ ఒపి మీద ఇట్ ఈజ్ ఫిట్ రీ అసెస్మెంట్ లేదా ఇట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీ అసెస్మెంట్ అని రాయాలి, లేదా వారు ఎలిజిబుల్ కారు మరలా తనిఖీ చేసిన డాక్టర్ గారికి అనిపిస్తే వెంటనే వారికి మీరు అర్హులు కారు సదరం రూల్స్ ప్రకారం అని చెప్పి వెనక్కి పంపవచ్చును.
ఎలిజిబుల్ అని డాక్టర్ గారు ఒపి మీద రాస్తే గనుక అట్టి డాక్టర్ గారు వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారికి ఒక లెటర్ రాయాలి. సదరు దివ్యాంగుడికి రీ అసెస్మెంట్ కి అవకాశం ఇవ్వమని…
పైన చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ ఉంటే కనుక అట్టి సదరం ఐడి కి రీ అసెస్మెంట్ కి అవకాశం ఇవ్వటం జరుగుతుంది.
ఏ సర్టిఫికెట్ కైనా రీ అసెస్మెంట్ ఇవ్వాలి అంటే సదరం మెయిల్ కి పంపాల్సిన డాక్యుమెంట్స్ :
1 స్పందన అర్జీ
2 డాక్టర్ OP
3 డాక్టర్ గారు కమిషనర్ గారికి రాసిన లెటర్
5. ఏ ఐడి అయినా గ్రీవెన్స్ సదరం సైట్లో రెండుసార్లు మాత్రమే పెట్టగలరు. రెండుసార్లు గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేస్తే గనుక ఆ ఐడి ని మూడవసారి గ్రీవెన్స్ పెట్టడం కుదరదు.మూడోసారి గ్రీవెన్స్ పెట్టడానికి ప్రయత్నించినా ఎర్రర్ 500 అనే మెసేజ్ చూపిస్తుంది.
Note: దివ్యంగులకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం మీరు ఈ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు!