పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కురిపించారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన, అమరావతికి రూ.15 వేల కోట్లతో ప్రత్యేక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఆర్థికవృద్ధి కోసం అదనపు కేటాయింపులు ఉంటాయన్నారు.
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి లభించిన హామీలు.
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం…అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు
- రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు
- రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ
- హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్-బెంగళూరుపారిశ్రామిక కారిడార్ అభివృద్ధి
- విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్లకుప్రత్యేక సాయం
- కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి
- విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి,హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు
- నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేకనిధులు
- విభజన చట్టంలో ఉన్న హామీల అమలు
- పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్ట్.