❁❁ యూనియన్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు ❁❁LIVE
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
- ➡ స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు
కొత్త పన్ను విధానంలో మార్పులు
- ➡ సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
- ➡ రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
- ➡ రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
- ➡ రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
- ➡ రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను
- ➡ రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
- ➡ కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ
- ➡ లాంగ్ టర్మ్ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను
- ➡ క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు
మొబైల్ ఫోన్లపై సుంకం తగ్గింపు..
మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఊరట
- ➡ క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
- ➡ మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- ➡ బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- ➡ బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గింపు
- ➡ ప్లాటినమ్పై 6.4 శాతాననికి కుదింపు
ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం
- ➡ ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతానికి తగ్గుతుందని అంచనా
- ➡ మరింత హేతుబద్ధంగా జీఎస్టీ రేట్లు
- ➡ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలు మరింత సరళతరం
NPSలో మార్పులు
- ➡ ఎన్పీఎస్ పథకంలో మార్పులు
- ➡ మైనర్లూ చేరేందుకు అవకాశం
ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధికి పెద్దపీట
- ➡ కాశీ తరహాలో గయ అభివృద్ధి
- ➡ బిహార్ రాజ్గిరి జైన్ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
- ➡ టూరిజం కేంద్రంగా నలందా అభివృద్ధి
మౌలిక సదుపాయాలకు ₹11.11 లక్షల కోట్లు
- ➡ మౌలిక సదుపాయల కల్పనకు బడ్జెట్లో మరోసారి పెద్దపీట
- ➡ బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు
- ➡ జీడీపీలో 3.4 శాతానికి సమానం
స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
- ➡ మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు
వరద నివారణకు బిహార్‌కు రూ.11వేల కోట్లు
- ➡ వరదల వల్ల బిహార్ ఏటా నష్టపోతోంది
- ➡ వరద నివారణకు, సాగు కార్యక్రమాలకు రూ.11వేల కోట్లు కేటాయింపు
- ➡ వరద నివారణకు అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక నిధులు
కనీసం 50% మిగులు ఉండేలా సవరింపు
ద్రవ్యోల్బణ నాలుగు శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నాం
ఆఫ్ షోర్ మైనింగ్ కు నూతన విధానం
➡ చిన్న మధ్య తరహా పరిశ్రమ అభివృద్ధికి అధిక సహాయం
➡ MSME క్లస్టర్లు నూతన CIDBI బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు
➡ ఎగుమతులు ఎగుమతులు సేవలకు ప్రత్యేక ప్లాట్ఫారం ఏర్పాటు
➡ 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పిన
➡ వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు ఎగుమతులకు ప్రణాళిక
కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం
బిహార్‌కు ఆర్థిక సాయం
- బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.ు
గ్రామీణ భారతానికి రూ.2.66 లక్షల కోట్లు
- బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు
- ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
- రాయలసీమ, ప్రకాశం , ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులుు
కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు
విశాఖ చెన్నై కారిడార్ లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ లో ఓర్వకల్లుకు నిధులు
పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడి పోలవరం
భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైనది
అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం
అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు
తూర్పు భారత రాష్ట్రాలలో దేవాలయ సంస్కృతిక పరిరక్షణకు ప్రత్యేక పథకం
బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిస్సా & ఏపీలో దేవాదాయ సాంస్కృతిక పరిరక్షణకు ప్రత్యేక పథకం
ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్‌ల కోసం కొత్తగా మూడు పథకాలు
- ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు
- ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు
- సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు
- గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు
- 210 లక్షల మంది యువతకు లబ్ధి
ఉద్యోగాల కల్పన నైపుణ్య అభివృద్ధికి రెండో ప్రాధాన్యత
కొత్త ఉద్యోగాల కల్పనలో తొలి నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది
కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపుల్లో మొదటి నాలుగేళ్లు ప్రోత్సహకాలు
యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.
నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.
వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం.
ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్లో నిర్ణయాలు.
కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.ం
ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.ం
9 ప్రధానాంశాల ఆధారంగా బడ్జెట్
- ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్ఎంఈపై దృష్టి
- వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
- వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నాం
బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలా సీతారామన్
ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలమ్మ