ఆగస్టు 15వ తేదీన అమలుకానున్నసంక్షేమ పథకాలు ఇవే

ఆగస్టు 15వ తేదీన అమలుకానున్నసంక్షేమ పథకాలు ఇవే

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రభుత్వం మూడు శుభవార్తలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టిసారించింది. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న మూడు కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఆగస్టు 15వ తేదీన అమలుకానున్నసంక్షేమ పథకాలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ప్రారంభించనుంది. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఈ పథకానికి దాదాపు రూ.250 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోంది, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో తెలంగాణ తరహాలో ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని ముందుకు పోవాలా.. లేదా కర్ణాటక తరహాలో మహాలక్ష్మి కార్డులు మాదిరిగా కార్డులు జారీచేయాలా అనే దానిపైనా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. దీంతో ఆగస్ట్ 15 నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయవచ్చంటూ ప్రచారం జరుగుతోంది.

తల్లికి వందనం

తల్లికి వందనం పథకం విషయానికి వస్తే పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమచేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంత మంది పిల్లలు ఉన్నాకూడా.. ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైనా ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఎంత మంది పిల్లలు ఉన్నాకూడా.. ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అన్నా క్యాంటీన్ల ఏర్పాటు

ఈ పథకం యొక్క లక్ష్యం తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడం, ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకు చౌక ధరలకే ఆహారం అందించడం వల్ల ఖరీదైన ఆహారం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్న క్యాంటీన్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి వీటిని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 100 చోట్ల క్యాంటీన్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో విడతలో 83, మూడో విడతలో 20 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపింది. మొత్తం 203 క్యాంటీన్లకు హరేకృష్ణ ఫౌండేషన్‌ ఆహారం సరఫరా చేయనుంది. అల్పాహారంతో పాటు భోజనం అందించనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న అమలు చేయనున్న ఈ మూడు పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చనున్నాయి.

You cannot copy content of this page