ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పెన్షన్ అమౌంట్ పెంచి లబ్ధిదారులకు ప్రతినెలా పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి ఉచిత గ్యాస్ సిలిండర్ పైన ప్రకటన చేశారు. దీపావళి నుంచి మహిళలకు పండుగ కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్టు ప్రకటించారు. ఇందుకు తాజాగా క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది.
అయితే ప్రభుత్వం ఇప్పుడు సిక్స్ లోని మరో రెండు పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తల్లికి వందనం పథకాన్ని మరో రెండు మూడు నెలల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానితో పాటు అన్నదాత సుఖీభవ నిధులను కూడా మార్చి లేదా ఏప్రిల్ నెలలో రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలవడనున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమం మరియు అభివృద్ధికి సమానంగా నిధులను కేటాయించాలని, భావించిన విషయం తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకర్షించాలని మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.
తల్లికి వందనం పథకం గురించి క్లుప్తంగా…
రాష్ట్రంలో చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులు తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఏడాది 15000 రూపాయలు జమ చేస్తుంది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలందరూ ఈ పథకానికి అర్హులు.
అన్నదాత సుఖీభవ పథకం గురించి క్లుప్తంగా
రాష్ట్రంలోని రైతులకు ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూపొందించిన పథకం అనదాత సుఖీభవ. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6000 రూపాయలకు అదనంగా 14 వేల రూపాయలు జోడించి మొత్తం 20,000 రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.