ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు 10న విడుదల.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి

ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు 10న విడుదల.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు..

అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేవారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.. ఆ అప్లికేషన్‌లను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది. అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరినవారి లిస్ట్‌ను కూడా రెడీ చేసింది. 

ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లులకు డబ్బులు విడుదల చేస్తారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సీబీఎస్‌ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 10న తల్లికి వందనం నగదు జమ చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల నగదు అందని వారి దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రభుత్వం అర్హత ఉన్నవారికి కూడా డబ్బులు జమ చేసింది.

మొత్తం 7,99,410 మంది విద్యార్థులకు గాను 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేస్తారు. మొదటి విడతలో కొందరు అర్హులైనప్పటికీ డబ్బులు రాలేదు.. వారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు వారి సమస్యలను పరిష్కరించారు. అర్హులుగా తేలిన 1.34 లక్షల మందికి కూడా ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు జమ చేశారు.

ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్టియ్ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల్ని అధికారులు అలర్ట్ చేశారు. ఈనెల 10న తల్లికి వందనం రూ.13వేలు తల్లుల బ్యాంకు అకౌంట్‌లలో జమ చేస్తారని.. కాబట్టి బ్యాంకు అకౌంట్‌ను, ఆధార్‌ నంబరుకు ఎన్‌ పీసీఐ లింక్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే తప్పనిసరిగా బ్యాంకు ఖాతా , లేని పక్షంలో పోస్టాఫీసు ఖాతాను తెరిచి ఆధార్‌ నంబరుకు ఎన్‌పీసీఐ లింక్‌ చేయించుకోవాలి అని సూచించారు.

తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోండి

సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటుస్ చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼[Thalliki Vandanam Payment Status 2025]

తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ ను సొంతంగా తెలుసుకునేందుకు నేరుగా కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి

Scheme : Thalliki Vandanam
Year : 2025-2026
UID : తల్లి / తండ్రి / సంరక్షకుల lఆధార్

ఎంటర్ చేసి చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేసి ఆధార్ కు లింక్ ఉన్న మొబైల్ కు వచ్చే OTP నమోదు చేస్తే స్టేటస్ తెలుస్తుంది.

సచివాలయం లో తెలుసుకునే విధానం

తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకునేందుకు జాబితా మొత్తం చదివే పని లేకుండా నేరుగా సచివాలయ ఉద్యోగులైన WEA/DA/WWDS/WEDPS వారి BENEFICIARY MANAGEMENT వెబ్ సైట్ లాగిన్ నందు నేరుగా చెక్ చేసుకునే “Track Application Status” ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దేనికి కేవలం తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది వారు అర్హుల అనర్హుల అనే విషయం తెలుస్తుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page