ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం PMSSY అనేది ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి పొదుపు పథకం. ఈ పథకం ద్వారా ఆడపిల్లల భవిష్యత్తుకు ఒక చక్కటి భరోసా లభిస్తుంది.
ప్రతినెలా గరిష్టంగా జమ చేస్తే 21 ఏళ్ల లో 67.34 లక్షలు పొందవచ్చు
సుకన్య సమృద్ధి పథకంలో జాయిన్ అవ్వాలంటే కనిష్టంగా 250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు చేయవచ్చు.
ఒకవేళ సంవత్సరానికి లక్ష 50 వేల రూపాయలు అంటే ప్రతినెలా 12,500 రూపాయలను పొదుపు చేస్తే చాలు ఈ పథకం ద్వారా మెచ్యూరిటీ సమయానికి 67.34 లక్షలను సులభంగా పొందవచ్చు.
ఈ పథకానికి సంబంధించి కాలవ్యవధి 21 సంవత్సరాలు ఉంటుంది. కానీ మీరు 15 సంవత్సరాలు మాత్రమే అమౌంట్ చెల్లిస్తారు. ఉదాహరణకు మీరు పాప ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఈ పొదుపు ప్రారంభించినట్లయితే, పాపకు 15 సంవత్సరాల నాటికి మీరు గరిష్టంగా చెల్లించే అమౌంట్ 22.5 లక్షలు.
ఆ తర్వాత 21 సంవత్సరాలు వరకు మీరు వెయిట్ చేస్తే చాలు, మీ అమౌంట్ 67.34 లక్షలు అయ్యి మీ చేతికి వస్తుంది. ఇది మీ పాప బంగారు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సుకన్య సమృద్ధి పథకం గురించి మీ కోసం
ఆడపిల్ల ఉన్న తల్లి తండ్రులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప పథకం ఇది.
ఈ పథకం ద్వారా పాప కు 10 ఏళ్ల వయసు వచ్చే లోపు ఈ పథకాన్ని ఎప్పుడైనా తెరవచ్చు.
ఒక ఆడపిల్ల పేరు మీద ఒకే ఖాతాను మాత్రమే తెరవవచ్చు.
ఖాతాను ఏదైనా తపాలా శాఖ లేదా బ్యాంకుల నుంచి ఓపెన్ చేయవచ్చు
ఖాతాను తెరవడానికి పాప బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి
ఖాతాను కనీస మొత్తం 250 తో తేరవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి కొత్త వడ్డీ రేట్లు
ఎక్కువ వడ్డీ మరియు పన్ను మినహాయింపు తో ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కు కేంద్రం అందిస్తున్న గొప్ప పథకం ఇది. గత ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకానికి 7.6% వడ్డీని చెల్లిస్తూ వస్తున్న కేంద్రం , ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వడ్డీ రేటు ను 8.0% పెంచడం జరిగింది.
PMSSY Revised Interest Rate 2023-24 : 8.0%
ఈ పథకాన్ని ఆడపిల్ల పేరు పైన తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్ల లోపు మాత్రమే ఈ పథకం తెరిచే అవకాశం ఉంటుంది. ఈ పథకం లో ప్రతి ఏటా గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే సౌలభ్యం ఉంటుంది. 21 ఏళ్ల కు ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఉన్నత చదువుల నిమిత్తం 50% వరకు అమౌంట్ ముందస్తు withdraw చేసే అవకాశం ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కింది లింక్ లో చూడవచ్చు
ఈ పథకాన్ని మీ దగ్గర లోని పోస్టాఫీసు లేదా బ్యాంకులలో ఓపెన్ చేయవచ్చు.
Application Process – అప్లై చేయు విధానం
మీ దగ్గర లో ఉండే పోస్టాఫీసు కు వెళ్లి సుకన్య సమృద్ధి అకౌంట్ ఫార్మ్ తీసుకోండి
అన్ని వివరాలు నింపి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్,పాప ఫోటో, పేరెంట్ ఆధార్ కార్డ్ మరియు ఫోటో సమర్పించాలి.
అకౌంట్ ఓపెన్ అయ్యేందుకు 2 రోజుల సమయం పడుతుంది.
అకౌంట్ లో మీరు ప్రతి నెల కూడా అమౌంట్ జమ చేసే సౌలభ్యం ఉంటుంది. పోస్టాఫీసు ద్వారా అయితే ఆన్లైన్ లో కూడా మీరు ప్రతి నెల ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం ఉంది.
Leave a Reply