ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం PMSSY సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
సుకన్య సమృద్ధి కొత్త వడ్డీ రేట్లు
ఎక్కువ వడ్డీ మరియు పన్ను మినహాయింపు తో ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కు కేంద్రం అందిస్తున్న గొప్ప పథకం ఇది. గత ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకానికి 7.6% వడ్డీని చెల్లిస్తూ వస్తున్న కేంద్రం , ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వడ్డీ రేటు ను 8.0% పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
PMSSY Revised Interest Rate 2023-24 : 8.0%
ఈ పథకాన్ని ఆడపిల్ల పేరు పైన తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్ల లోపు మాత్రమే ఈ పథకం తెరిచే అవకాశం ఉంటుంది. ఈ పథకం లో ప్రతి ఏటా గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే సౌలభ్యం ఉంటుంది. 21 ఏళ్ల కు ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఉన్నత చదువుల నిమిత్తం 50% వరకు అమౌంట్ ముందస్తు withdraw చేసే అవకాశం ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కింది లింక్ లో చూడవచ్చు
ఈ పథకాన్ని మీ దగ్గర లోని పోస్టాఫీసు లేదా బ్యాంకులలో ఓపెన్ చేయవచ్చు.
Application Process – అప్లై చేయు విధానం
మీ దగ్గర లో ఉండే పోస్టాఫీసు కు వెళ్లి సుకన్య సమృద్ధి అకౌంట్ ఫార్మ్ తీసుకోండి
అన్ని వివరాలు నింపి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్,పాప ఫోటో, పేరెంట్ ఆధార్ కార్డ్ మరియు ఫోటో సమర్పించాలి.
అకౌంట్ ఓపెన్ అయ్యేందుకు 2 రోజుల సమయం పడుతుంది.
అకౌంట్ లో మీరు ప్రతి నెల కూడా అమౌంట్ జమ చేసే సౌలభ్యం ఉంటుంది. పోస్టాఫీసు ద్వారా అయితే ఆన్లైన్ లో కూడా మీరు ప్రతి నెల ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం ఉంది.
Leave a Reply