జనవరి 26న త్రీ వీలర్ పంపిణీకి సర్వం సిద్ధం.. ఒక్కో నియోజకవర్గానికి 10 వాహనాలు కేటాయించిన ప్రభుత్వం.
రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (ఏపీడీఏఎస్సీఎసీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
అర్హతలు
- 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు
- 70 శాతంపైగా వైకల్యం కలిగిన వ్యక్తులు
- గ్రాడ్యుయేషన్ మరియు అంతకంటే ఎక్కువ కోర్సులను క్రమం తప్పకుండా చదువుతున్న బోనాఫైడ్ విద్యార్థులు.
- కనీసం పదో తరగతి పాసైన వ్యక్తులు
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,00,000/ మించకూడదు
- కనీసం రెండు నెలల ముందు తీసుకున్న వాహనాన్ని నడపడం కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి
- ఆంధ్ర ప్రదేశ్ నివాసి అయి ఉండాలి
- కేవలం జీవితంలో ఒక్కసారి మాత్రమే తీసుకోవడానికి అర్హులు
- ఎటువంటి మోటారు వాహనాన్ని కలిగి ఉండకూడదు.
- మరో వ్యక్తి సహాయంతో నడవాలి లేదా అతను రెండు కాళ్ళు వైకల్యం కలిగి ఉండాలి
- నివాస వివరాలు అయిన జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, మండలం/ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ/ వార్డు, గ్రామం/ప్రాంతం వివరాలను నమోదు చేయాలి.
- గతంలో దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
కావలసిన డాక్యూమెంట్లు
- జిల్లా మెడికల్ బోర్డు ఇచ్చిన సదరం సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- ఎస్ఎస్సీ సర్టిఫికెట్
- ఎస్సీ, ఎస్టీ అయితే కుల ధ్రువీకరణ పత్రం
- పాస్పోర్టు సైజులో ఉన్న దివ్యాంగుల పూర్తి ఫొటో
- 01-01-2022న లేదా ఆ తర్వాత తహశీల్ధార్ నుండి తీసుకున్న తాజా ఆదాయ ధృవీకరణ పత్రం.
- విద్యార్థులయితే వారు చదువుతున్న విద్యా సంస్థ నుండి బోనాఫైడ్ సర్టిఫికేట్
- ఉద్యోగులయితే, సంబంధిత MPDO లేదా మునిసిపల్ కమీషనర్ నుండి తీసుకున్న స్వీయ/వేతనం/జీతం ఉపాధి ధృవీకరణ పత్రం
- వైకల్యాలున్న వ్యక్తుల ప్రయోజనాన్ని మోసపూరితంగా వినుకుంటే విధించే శిక్ష సెల్ఫ్ డిక్లరేషన్
- మోటరైజ్డ్ త్రి వీలర్ వాహన ప్రయోజనాన్ని ప్రయోజనాన్ని ముందుగా పొందలేదని మరియు అతనికి/ఆమెకు స్వంతంగా ఎలాంటి మోటరైజ్డ్ వాహనం (రెండు/మూడు/ఫోర్ వీలర్) లేదు అని సెల్ఫ్ డిక్లరేషన్
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 31-10-2022 15-November-2022
రిజర్వేషన్
Women – 50%, Men – 50% (SC – 16%, ST – 7% & General – 77%)
Leave a Reply