సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ఇది వరకే విడుదల చేసింది.

ఈ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఏమిటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రభుత్వం 3 పథకాల లబ్ధిదారులకు నిధులను విడుదల చేయనుంది.

ఆ పథకాల వివరాలు. [List of Welfare schemes to be implemented in September 2023]

  1. వైఎస్ఆర్ చేయూత
  2. వైయస్సార్ వాహన మిత్ర
  3. వైయస్సార్ కాపు నేస్తం

ఈ పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం

వైఎస్ఆర్ చేయూత

రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది

ఈ సంవత్సరానికి గాను కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ , eKYC మరియు వెరిఫికేషన్ ఇప్పటికే మొదలైంది. త్వరలో ఈ పథకం నిధుల విడుదల తేదీని ప్రకటించనుంది.

వైఎస్సార్‌ కాపు నేస్తం

రాష్ట్రంలోని కాపు వర్గానికి చెంది, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది.

ఈ సంవత్సరానికి గాను కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ , eKYC మరియు వెరిఫికేషన్ ఇప్పటికే మొదలైంది. త్వరలో ఈ పథకం నిధుల విడుదల తేదీని ప్రకటించనుంది.

వైఎస్సార్‌ వాహనమిత్ర

రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సి, మ్యాక్సి డ్రైవర్ల వాహన మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు పొందటానికి ప్రభుత్వం డ్రైవర్లకు పది వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది.

ఈ సంవత్సరానికి గాను కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ , eKYC మరియు వెరిఫికేషన్ ఇప్పటికే మొదలైంది. త్వరలో ఈ పథకం నిధుల విడుదల తేదీని ప్రకటించనుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page