రేపటి (6-01-2023) నుంచి దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబందించి సదరం స్లాట్ బుకింగ్ రేపు ఉదయం 10 గంటల తర్వాత ఓపెన్ అవుతుంది. సచివాలయాలలో అభ్యర్థులు స్లాట్లు బుక్ చేసుకోవచ్చు
ఈసారి స్లాట్ బుకింగ్ లో కొన్ని కొత్త అప్డేట్స్
- స్లాట్ బుకింగ్
- Appeal 1
- Appeal 2
ఈ మూడు ఆప్షన్స్ enable చేయబడ్డాయి.
స్లాట్ బుకింగ్ : కొత్తగా బుక్ చేసుకొనుటకు ఈ ఆప్షన్ ఉపయోగించాలి
■ Appeal 1 : percentage తక్కువ వేసిన సందర్బాల్లో,రిజెక్ట్ చేసిన, టెంపరరీ సర్టిఫికేట్ మంజూరు అయిన వారు అప్పీల్ 1 ద్వారా మరల అదే సదరం ఐడీ తో కొత్త స్లాట్ పొందవచ్చు.
■ Appeal 2 : appeal 1 లో కూడా రిజెక్ట్ అయితే అప్పీల్ 2 ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్పీల్ 2 లో వచ్చే సర్టిఫికేట్ అంతిమంగా ఉంటుంది. అప్పీల్ 2 లో రిజెక్ట్ అయితే మళ్ళీ వాళ్ళకి సదరం బుక్ చేసుకొనే అవకాశం ఉండదు.
అప్పీల్ 1,2 వాళ్ళకి హాస్పిటల్ లు రాండమ్ గా కేటాయించబడతాయి.
సదరం డిలీట్ కొరకు ఇకపై కలక్టర్ ఆఫీస్ స్పందన కు వెళ్ళవలసిన అవసరం లేదు. వికలాంగుల సౌకర్యం కొరకు ప్రభుత్వం ఈ విధానాన్ని సచివాలయం ద్వారా అందుబాటులోకి తెస్తుంది.
Leave a Reply