Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

రైతులందరికీ ముఖ్య గమనిక. 2023-24 సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి ఎవరైనా కొత్తగా రైతు భరోసా కి అప్లై చేయాలనుకునేవారికి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

అర్హులైన రైతులు తమ ఆధార్ జిరాక్స్ , 1బి జిరాక్స్ తో మీ దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవచ్చు. అంతే కాకుండా ఏ కుటుంబంలో అయితే రైతు భరోసా పొందే లబ్ధిదారుడు మరణిస్తారో అటువంటి వారి spouse /legal heir [డెత్ అయిన వారి భార్య లేదా భర్త లేదా చట్ట రీత్యా వారసులు ] రైతు భరోసా కి అప్లై చేసుకోవచ్చు.అయితే ఇటువంటి అప్లికేషన్స్ కి తప్పనిసరిగా డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి.

అంతేకాకుండా, రైతు భరోసా కొత్త అప్లికేషన్స్ తో పాటు అనర్హులు అయిన వారికి, లేదా చనిపోయిన వారికి ఈ పథకం నుంచి తొలగించేందుకు కూడా వ్యవసాయ సహాయకులకు ఆప్షన్ ను కల్పించడం జరిగింది.

రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఎప్పుడంటే

కొత్తగా రిజిస్టర్ చేసుకునే వారికి ఈనెలాఖరు అంటే ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వీరికి మే నెలలో విడుదల రైతు భరోసా అమౌంట్ జమ చేయనున్నట్లు వెల్లడించారు.

Rythu Bharosa New Registrations opened for 2023-24. Last Date: 30.04.2023

మీ రైతు భరోసా – PM కిసాన్ స్టేటస్ కోరకు కింది లింక్స్ చెక్ చేయండి.

Click here to Share

One response to “Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే”

  1. Chandra shekar Reddy Avatar
    Chandra shekar Reddy

    Rythu bharasa new registration date

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page