PMJAY 2.0 – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

PMJAY 2.0 – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

“సొంత స్థలము కలిగి ఉండి, గృహము కట్టుకొనుటకు సిద్దముగా ఉండి అర్హత కలిగిన కుటుంబాల వారు ఈ క్రింద తెలిపిన పత్రముల జిరాక్స్ కాపీలు మరియు ”4బి” అప్లికేషన్ ఫామ్ ను గ్రామ/ వార్డు సచివాలయ కార్యాలయము నందు వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ / వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల/ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను సంప్రదించి 30.01.2025 లోపు దరఖాస్తుచేసుకొనవచ్చు.

అర్జీదారులు డిమాండ్ సర్వే మరియు PMAY 2.0 వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది.

సూచనలు :

  1. అర్జీదారురాలు మరియు వారి భర్తతో కలిసి ఉన్న ఫోటో విధిగా అర్జీకి అతికించవలెను.
  2. ఆదాయ ధృవీకరణ పత్రము
  3. రేషన్ కార్డు, కరెంట్ బిల్,హౌస్ టాక్స్ బిల్ కాపీ.
  4. ఓటరు ఐ.డి. కార్డ్
  5. కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డుల నకళ్ళు .
  6. కుల ధృవీకరణ పత్రం
  7. వ్యక్తిగత బ్యాంకు ఖాతా మొదటి పేజి (ఆధార్ అనుసంధానం అయివుండాలి)
  8. ఇంటిపట్టా లేదా సొంత ఇంటి స్థల డాక్యుమెంటు లేదా పొసెషన్ సర్టిఫికేట్,.
  9. అంగవైకల్యము ఉన్నచో సంబంధిత సర్టిఫికేట్ మొదలగునవి జిరాక్స్ కాపీలు అర్జీకి జతపరచవలెను. జిరాక్స్ కాపీల నందు అర్జీ దారుని సంతకం చేయవలెను.
    IMP: 1. OTP కొరకు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింకు అయ్యి వినియోగం లో ఉండి వుండాలి

అర్హులైన వారందరూ ఈ అవకాశమును సద్వినియోగ పరుచుకోవలెనని తెలియజేయడమైనది.

PMAY 2.0 – Eligibility Criteria

  • గతంలో ఎప్పుడు ఇల్లు మీ పేరు మీద శాంక్షన్ అయ్యి ఉండరాదు.
  • పక్క ఇల్లు కలిగిన హౌస్ టాక్స్ మీ పేరు పై ఉండ రాదు .
  • ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు .
  • 4 చక్రాల వాహనం ఉండరాదు .
  • ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను కట్టరాదు.
  • భూమి ఉంటె, కనీసం 340 చదరపు అడుగుల భూమి ఉండాలి .
  • అప్లికేషన్ చేస్తున్న వారు ఉన్న రైస్ కార్డు / రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎవరికీ గతంలో హౌస్ శాంక్షన్ అయ్యి ఉండరాదు

PMAY 2.0 – Documents Required

  • ఆధార్ కార్డుల జెరాక్స్ [ భార్య + భర్త ] సంతకాలతో 2. రేషన్ కార్డు / బియ్యం కార్డు జెరాక్స్
  • బ్యాంకు అకౌంట్ జెరాక్స్ [ భార్య + భర్త ] 4. జాబ్ కార్డు జెరాక్స్
  • దరఖాస్తు దారుని పాస్ పోర్ట్ సైజు ఫోటో [2]
  • పట్టా లేదా పొజిషన్ సర్టిఫికెట్ జెరాక్స్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • పనిచేస్తున్న మొబైల్ నెంబర్
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page