Big Update : ఏపి లో PM కిసాన్ పడాలంటే మరో కండిషన్ పెట్టిన ప్రభుత్వం

Big Update : ఏపి లో PM కిసాన్ పడాలంటే మరో కండిషన్ పెట్టిన ప్రభుత్వం

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది.

ఇకపై పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే రాష్ట్ర వెబ్ ల్యాండ్ లో ఉన్నటువంటి భూమి వివరాలను ఆధార్ తో అనుసంధానం (ఆధార్ సీడింగ్) చేయించుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

అలా చేస్తేనే ఇకపై పిఎం కిసాన్ నిధులు జమవుతాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 1.9 లక్షల మంది పీఎం కిసాన్ లబ్ధిదారులు ఇంకా తమ భూమి వివరాలను ఆధార్ అనుసంధానం చేయించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

వెబ్ లాండ్ లో భూమి కలిగి ఆధార్ సీడింగ్ కానీ రైతులు న్యూట్రిషన్ తర్వాత తమ భూమి వివరాలను ఆధార్ తో అనుసంధానం చేసుకునే అవకాశాన్ని వీఆర్వో లాగిన్ లో కల్పించినట్లు ఆయన ప్రకటించారు.

ఈ ప్రక్రియ అంతా రెండు వారాల్లో పూర్తి కావాలని పేర్కొన్నారు. అదేవిధంగా అర్హత లేని రైతులను పిఎం కిసాన్ పోర్టల్ లో అనర్హులు గా గుర్తించాలని కూడా అధికారులకు ఆయన సూచించారు. అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్ నిలిపి వేసినట్లు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు వెళ్తాయి తద్వారా అమౌంట్ పడదు.

వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరి కిరణ్, సిసిఎల్ కమిషనర్ సాయి ప్రసాద్ ఎడిషనల్ సెక్రెటరీ మహమ్మద్ ఇంతియాజ్ తో కలిసి మంగళవారం ఒక ప్రకటనలో గోపాలకృష్ణ ద్వివేది ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

రైతులు మీసేవ పోర్టల్ ద్వారా కూడా తమ వెబ్ ల్యాండ్ లో ఉన్నటువంటి భూములను ఆధార్ తో అనుసంధానం చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ కి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మరియు స్టేటస్ కోసం కింది లింక్ ని వీక్షించండి.

You cannot copy content of this page