ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM కిసాన్ సంబంధించి 14వ విడత అమౌంట్ ను కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్నటువంటి రైతులు తప్పనిసరిగా పూర్తిచేయాలని అధికారులు సూచించారు.
నెలాఖరు నాటికి ఈ కేవైసీ పూర్తి చేయాలని ఏపీ స్పెషల్ కమిషనర్ ఆదేశాలు
ఇప్పటివరకు ఈకేవైసీ పూర్తికాని లబ్ధిదారులు ఈ నెలాఖరు
లోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ రైతులకి విజ్ఞప్తి చేశారు.
ఈకేవైసి ని ఆధార్ ఎంటర్ చేసి రెండే నిమిషాలలో ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో చేసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
లింక్ అయిన వారు కింది లింక్ క్లిక్ చేసి ఆన్లైన్లో సులభంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోండి.
ఇక మొబైల్ కి ఆధార్ లింక్ కాని వారు మీసేవ కేంద్రంలో లేదంటే ఏపీలో అయితే సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా సులభంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
బయోమెట్రిక్ (వేలిముద్రలు) అథంటికేషన్తో పాటు
ఈసారి ఫేస్ అథంటికేషన్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వేలి ముద్రలు పడని వారు, ఆధార్- ఫోన్ నంబర్ లింక్ కాని వారు రైతు భరోసా కేంద్రాలు లేదా సచివాలయాలలో వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ ఫేస్ అథంటికేషన్ మొబైల్ ద్వారా ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చునన్నారు.
పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు కింది పేజ్ చెక్ చేయండి
PM కిసాన్ 14వ విడత 2000 అమౌంట్ కేంద్ర ప్రభుత్వం జూలై నెలలో విడుదల చేయనుంది.
Leave a Reply