అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

అటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూసిన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు ఈరోజు అనగా ఆగస్టు 2 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి.

అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన సీఎం

కుటుంబ ప్రభుత్వం తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను ఆగస్టు 2 న విడుదల చేయటం జరిగింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతా లో ముఖ్యమంత్రి 3174.43 నిధులు విడుదల చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దర్శి పర్యటనలో భాగంగా సీఎం ఈ అమౌంట్ ను విడుదల చేశారు.

CM releasing Annadata Sukhibhava

పీఎం కిసాన్ మిత్రులను విడుదల చేసిన ప్రధానమంత్రి

అటు దేశవ్యాప్తంగా 9.70 కోట్ల మంది రైతుల ఖాతాలో ప్రధాని మోదీ 20500 కోట్లు జమ చేయడం జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు.

రైతుల ఖాతాలో 7 వేలు జమ, స్టేటస్ చెక్ చేయండి

పీఎం కిసాన్ 2000 మరియు అన్నదాత సుఖీభవ కింద 5000 కలిపి మొత్తంగా 7 వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో జమ చేశాయి.

అన్నదాత సుఖీభవ స్టేటస్ మరియు పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ కింది లింక్స్ ద్వారా తెలుసుకోండి.

Annadata Sukhibhava Status 2025

PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ అమౌంట్ పడాలంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతా ఆక్టివ్ గా ఉండి NPCI లింకింగ్ అయి ఉండాలి. మీ NPCI స్టేటస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాలో అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు పడుతున్నాయి. ప్రతి ఒక్కరికి సోమవారం లోపు అమౌంట్ పడే అవకాశం. ఆన్లైన్ లో Payment status అప్డేట్ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అర్హత ఉన్న వారందరికీ ఆగస్ట్ 4 లోపు అమౌంట్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

One response to “అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి”

  1. HARISH Avatar
    HARISH

    No amount sir

You cannot copy content of this page