కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ న్యూస్ తెలిపింది.
PM Kisan విడుదల తేదీ ఎప్పుడంటే ?
పీఎం కిసాన్ 13వ ఇన్స్టాల్మెంట్ జనవరిలో విడుదల అవ్వాల్సింది ఇప్పటికే వాయిదా పడిన విషయం తెలిసిందే.. అయితే ఈ అమౌంట్ ని ఫిబ్రవరి 27 వ తేదీన రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కర్ణాటక లోని బెల్గావి పర్యటనలో భాగంగా పిఎం కిసాన్ తదుపరి అమౌంట్ ను ప్రధాని విడుదల చేయనున్నారు.
అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పేరుతో ఈ నిధులను జమ చేయనుంది.
అయితే ఈసారి అమౌంట్ ఎంత పడుతుంది?
ఈసారి పీఎం కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు మాత్రమే జమ అవుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రైతు భరోసా అమౌంట్ పిఎం కిసాన్ తో కలిపి మూడు విడతలలో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
మేలో తొలివిడతగా 7,500, అక్టోబర్ లో 4000 ఇక జనవరిలో 2000 రూపాయలు మొత్తం కలిపి 13500 రూపాయలను జమ చేస్తారు.
అయితే ఈసారి పీఎం కిసాన్ ఈ కేవైసీ ఇంకా చాలామందికి పెండింగ్ ఉండటంతో పిఎం కిసాన్ వాయిదా వేసింది కేంద్రం.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిలీజ్ ను వాయిదా వేయటం జరిగింది. ఎందుకంటే ఈసారి జమ అయ్యేది కేవలం pm కిసాన్ అమౌంట్ మాత్రమే.
ఈసారి ఈ కేవైసీ చేసిన వారికే అమౌంట్ వేస్తారా?
ఈసారి 13వ ఇన్స్టాల్మెంట్ ఈ కేవైసీ పూర్తయిన రైతుల ఖాతాలోనే వేయనున్నట్లు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇందుకోసం పలమార్లు డెడ్ లైన్ విధించినప్పటికి ఇంకా కొంతమంది రైతులు ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఈ కేవైసీ ఆప్షన్ ఓపెన్ లోనే ఉంది అయితే గత వారం గడువులోగా ఈకేవైసి పూర్తి చేసిన వారికే 13వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పడనున్నట్లు తెలుస్తోంది.
13 వ ఇన్స్టాల్మెంట్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
పీఎం కిసాన్ 13 వ ఇన్స్టాల్మెంట్ సంబంధించి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కింది లింక్ ద్వారా తెలుసుకోండి.
Leave a Reply