PM కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసి పూర్తి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఈ నెలాఖరులోగా పెండింగ్ ఈ కేవైసి రికార్డులను పరిశీలించి రైతుల ఈకైవైసి పూర్తి చేసేలా చూడాలని ఆదేశించింది.
ఏపి లో ఇంకా 6.47 లక్షల మంది రైతులకు ఈకేవైసి పెండింగ్
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా 6.47 లక్షల రికార్డులకు ఈకేవైసి పెండింగ్ ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు.
ఈ నెలాఖరు నాటికి వీటికి ఈకేవైసి పూర్తి చేయాలని అధికారులను మరియు రైతులను కోరారు.
EKYC ప్రక్రియ కు మూడు విధానాలు కల్పించిన ప్రభుత్వం
PM Kisan EKYC ప్రక్రియ పూర్తి చేయడం కోసం ఈ సారి మూడు విధానాలు తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది
1. ఆధార్ కి మొబైల్ లింక్ అయి ఉంటే నేరుగా కింది లింక్ ద్వారా రైతులు EKYC పూర్తి చేయవచ్చు.
పై లింక్ లో మీ ఆధార్ ఎంటర్ చేయగానే, మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి ఆరు అంకెల OTP సంఖ్య మెసేజ్ రూపంలో వస్తుంది. అది తిరిగి పై లింక్ లో ఎంటర్ చేయగానే ఈకేవైసి పూర్తి అయినట్లే.
2. ఆధార్ కి మొబైల్ లింక్ కానీ వారు బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయాలి. ఇందుకోసం మీరు సచివాలయం లేదా మీ సమీప మీ సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు.
3. ఇక మూడవ విధానం లో వృద్ధులకు , వేలు ముద్రలు పడని వారికి నేరుగా ముఖ ఆధారంగా బయోమెట్రిక్ అనగా ఫేషియల్ authentication ద్వారా EKYC పూర్తి చేయవచ్చు.
PM కిసాన్ 14 వ విడత జాబితా లో మీ పేరు చెక్ చేయండి
అర్హత ఉన్న వారు ఈ నెలాఖరు లేదా వచ్చే నెల విడుదల చేయనున్న pm కిసాన్ 14 వ విడత జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి. ఇందుకోసం అన్ని లింక్స్ కింది లింక్ లో ఇవ్వబడ్డాయి. చెక్ చేయండి
Leave a Reply