దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే 13 విడతలుగా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు 14 వ విడత నగదు బదిలీ చేసేందుకు సన్నద్దమయింది.
ఖరీఫ్ సీజన్ మొదలైన క్రమంలో 14వ విడత డబ్బుల కోసం దేశంలోని కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. అలాంటి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది.
14వ విడత అమౌంట్ ఎప్పుడు?
కేంద్ర ప్రభుత్వం ఈ నెల అంటే జులై 27న పీఎం కిసాన్ 14వ విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అమౌంట్ పొందాలంటే రైతులు ఇ-కేవైసీ, భూమి పత్రాల వెరిఫికేషన్ సహా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ వంటివి పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌ను ఎన్‌పీసీఐకి లింక్ చేసి ఉండాలి. అప్పుడే రైతుల ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.
PM Kisan 14 Installment to be released on : 27 July 2023
అయితే, రైతులు డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు
రైతులు విజయవంతంగా పీఎం కిసాన్ సాయం అందుకోవాలంటే తగిన అర్హతలతో పాటు కొన్ని స్టేప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
- అందులో ఇ-కేవైసీ ప్రధానమైనది. రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిందే.
- అలాగే తమ భూమి పత్రాలను వెరిఫై చేయించాలి..
- దీంతో పాటు రైతులు తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ నంబర్ లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంకు ఖాతాలో 14వ విడత డబ్బులు రావు.
మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆదార్, ఎన్‌పీసీఐ నంబర్ లింక్ అయితో లేదో యూఐడీఏఐ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు
Leave a Reply