దేశవ్యాప్తంగా రైతులందరికీ ముఖ్య గమనిక.. ప్రతి ఏడాది మూడు విడతల్లో 6000 చొప్పున పీఎం కిసాన్ అమౌంట్ ను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా 14వ ఇన్స్టాల్మెంట్ విడుదల కు సన్నాహాలు చేస్తుంది.
ఇప్పటికే 13వ pm kisan ఇన్స్టాల్మెంట్ ను ఫిబ్రవరి 27 న విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే గత విడత ఈ కేవైసీ పూర్తయిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ అమౌంట్ వేయడం జరిగింది. అయితే ఈసారి కూడా 14 ఇన్స్టాల్మెంట్ తప్పనిసరిగా ఈ కేవైసీ చేసిన వారికి మాత్రమే పడుతుంది. మరి మీరు ఈ కేవైసీ చేశారా లేదా అనేది కింది లింక్ ద్వారా చెక్ చేయండి. చేయని వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఆధార్ కి లింక్ అయినా మొబైల్ తో వెంటనే పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీకు ఆధార్ కి మొబైల్ లింక్ కానిపక్షంలో మీరు మీ సేవ సెంటర్ కు వెళ్లి పూర్తి చేయవచ్చు
పీఎం కిసాన్ అమౌంట్ 14 విడత ఎప్పుడు జమ చేస్తారు?
14వ విడత పిఎం కిసాన్ అమౌంట్ ను కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి మే నెలలో విడుదల చేయాల్సి ఉంది. ఈసారి కూడా మే నెల ఆఖరిలో లేదా జూన్ మొదటి వారంలో ఈ అమౌంట్ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన అధికారికంగా ఇప్పటివరకైతే ప్రకటన వెలువడ లేదు అయినప్పటికీ అధికారిక వర్గాల సమాచారం మరియు గత విడతలు గమనిస్తే, కచ్చితంగా మే నెల ఆఖరిలో లేదా జూన్ మొదటి పక్షంలోనే రైతుల ఖాతాలో అమౌంట్ పడనుంది.
పీఎం కిసాన్ ఈ కేవైసి చేయని కారణంగా గత విడత అమౌంట్ ఈసారి పడుతుందా?
ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని కారణంగా 13వ విడత పిఎం కిసాన్ అమౌంట్ కోల్పోయారో వారికి ఈసారి ఈ కేవైసీ చేసినట్లయితే 13 మరియు 14 విడతలు రెండు కలిపి జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులకైతే ఈసారి పీఎం కిసాన్ 2000 మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే 5500 కలిపి ₹7500 రైతుల ఖాతాలో జమ కానున్నాయి.
ఇక పిఎం కిసాన్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం గూగుల్ లో studybizz pm Kisan అని టైప్ చేసి మీరు అప్డేట్స్ లింక్ పొందవచ్చు.
పీఎం కిసాన్ ఎలిజిబుల్ జాబితా మరియు స్టేటస్ లింక్ కింది పేజీలో ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.
Leave a Reply