PM Internship Scheme – Eligibility, Required Documents, Registration Link

PM Internship Scheme – Eligibility, Required Documents, Registration Link

PM Internship Scheme: యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని (PM Internship Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఏడాదిపాటు ఇంటర్న్షిప్ కల్పిస్తారు. దీంతో పాటు వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6,000 ఇంకా నెలకు రూ.5,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ లక్ష్యం ఏమిటి? – PM Internship Scheme Goal

దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మంది నిరుద్యోగ యువతకి ఉపాది నైపుణ్యాలను కల్పించడం.

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ అప్లై చేయడానికి ఎవరు అర్హులు ? PM Internship Scheme Eligibility

21-24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి భారతీయుడు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు SSC, HSC, ఐటీఐ, పాలిటెక్నిక్ లేదా B.Sc, B.Com, BCA, BBA లేదా బీఫార్మసీ వంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేసి ఉండాలి.

ఇంటర్న్షిప్ స్కీమ్ అప్లై చేయడానికి ఎవరు అనర్హులు? PM Internship Scheme Non Eligibility

  • MBA, MBBS, Phd, సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి అర్హతలు కలిగినవారు అనర్హులు.
  • ఇంకా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కూడా అనర్హులు. ఎటువంటి పర్మనెంట్ ఉద్యోగం చేస్తుండకూడదు.
  • ఈ పథకానికి అప్లై చేసుకునే వారి వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.
  • అలాగే ఫ్యామిలీలో ఎవరికీ కూడా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.
  • అలాగే ఇంకా ఏదైనా కోర్సు చదువుతున్నవారు కూడా అప్లై చేయడానికి అనర్హులు.

ఈ పథకంలో చేరడానికి ఏవైనా రిజర్వేషన్ నిబంధనలు ఉన్నాయా ?

ఎలాంటి రిజర్వేషన్లు లేవు. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్న్షిప్ కోసం అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు ?

అభ్యర్థులు ముందుగా పీఎం ఇంటర్న్షిప్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వారి వివరాలను నమోదు చేయాలి. వారి అర్హతలకు అనుగుణంగా వివిధ కంపెనీల్లో ఇంటర్న్షిప్ కోర్సులు చేయడానికి నమోదు చేసుకోవాలి. తర్వాత కంపెనీలు అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తాయి.

ఇంటర్న్షిప్ ఎన్ని రోజులు ఉంటుంది? PM Internship Scheme Duration

పథకానికి ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది.

అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం? PM Internship Scheme Required Documents

ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో అవసరం.

పీఎం ఇంటర్న్షిప్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ? How to Register to PM Internship Scheme

ఈ పథకానికి అర్హులైన వారు కింద ఇవ్వబడిన లింకు ద్వారా అప్లై చేసుకోవచ్చు

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page