రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ఇది వరకే విడుదల చేసింది. అయితే స్వల్ప మార్పులు చేర్పులతో మరియు నిర్దిష్ట తేదీలతో ఆయా నెలలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ప్రతి నెల అప్డేట్ ఇస్తుంది.
తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఏమిటి? ఏ రోజున ఏ పథకాన్ని అమలు చేస్తారు అనే డీటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో ప్రభుత్వం 3 పథకాల లబ్ధిదారులకు నిధులను విడుదల చేయనుంది.
ఆ పథకాల వివరాలు. [List of Welfare schemes to be implemented in October 2023]
1. ఆయుష్మాన్ భారత్ స్పెషల్ డ్రైవ్
2. జగనన్న చేదోడు
3. అక్టోబర్ 25 నుంచి సామాజిక బస్సు యాత్ర
ఆయుష్మాన్ భారత్ స్పెషల్ డ్రైవ్ – అక్టోబర్ 16 – 31
దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ప్రత్యేక క్యాంపులను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ క్యాంపు ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెడికల్ కళాశాలలో లేదా పాఠశాలల ఆభరణాలలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ఆరోగ్య క్యాంపులను నిర్వహించి, Ayushman Bharat కార్డులను అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది. ఆయుష్మాన్ భారత్ కార్డుల అర్హతలు మరియు ఇతర అంశాల గురించిన పూర్తి సమాచారం కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.
జగనన్న చేదోడు పథకం – అక్టోబర్ 19
ఇక రాష్ట్రవ్యాప్తంగా జగనన్న చేదోడు పథకాన్ని వరుసగా నాలుగో ఏడాది అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 19 న విడుదల చేయనుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్లకు ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఈ పథకానికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.
సామాజిక బస్సు యాత్ర అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు
నాలుగున్నరేళ్ల లో రాష్ట్ర ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుంది. తొలి విడతలో భాగంగా యాత్ర ఇచ్చాపురంలో అక్టోబర్ 26న మొదలై 13 రోజుల పాటు సాగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహిస్తారు.
Leave a Reply