రేషన్ డోర్ డెలివరీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన మరియు దివ్యాంగులు మినహాయిస్తే ఇంకా ప్రతి ఒక్కరికి జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల్లోనే రేషన్ రోడ్ డెలివరీ చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరుతోటి ఎండియు వాహనాలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 29 వేల చౌక ధర దుకాణాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎండియూ వాహనాలతో ప్రభుత్వానికి అదనంగా 1860 కోట్ల మేర ప్రజా ధనం వృథా అయినట్లు, మరోవైపు రేషన్ అక్రమ సరఫరా కూడా జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది.
దీంతో ఇకనుంచి నేరుగా దుకాణాల నుంచే స్టేషన్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

మరోవైపు రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ కడుగును ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. అర్హత ఉన్నటువంటి వారు సమీప సచివాలయం లేదా మీసేవ లేదా రేషన్ దుకాణానికి వెళ్లి జూన్ ఏడు లోపు ఈ కేవైసి పూర్తి చేసుకోగలరు.
రేషన్ కేవైసీ పూర్తి అయిందా లేదా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply