- కొత్త ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోటానికి ఇప్పుడు అందరికి అవకాశం ఉంది మరియు దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు.దరఖాస్తు ను మొబైల్ లొ కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు.
- దీనికోసం ఎవరు అయిన ఓటర్ కార్డు కలిగిన వారి ఓటర్ నెంబర్ ఉంటే చాలు. ఒక్క సారి ఓటర్ నమోదు చేసిన తరువాత సంబందించిన BLO వారు ఆమోదం చేస్తే ఎలక్షన్ కమీషన్ నుంచి కార్డు ప్రింట్ అయి వస్తుంది. e-ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
- దరఖాస్తు చేసుకోటాయిని ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు. కొత్తగా అప్లికేషన్ చేసుకోటానికి కేవలం ఆధార్ కార్డు, ఫోటో ఉంటే సరిపోతుంది.
- కొత్తగా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా NVSP అనే వెబ్ సైట్ లొ అకౌంట్ ఉండాలి. ఈ అకౌంట్ కు ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఈ అకౌంట్ ను 2 నిముషాల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క సారి అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ అకౌంట్ లాగిన్ అయ్యి ఎంత మందివి అయిన ఓటర్ కార్డుల కోసం దరఖాస్తు చెయ్యవచ్చు, మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
NVSP లొ అకౌంట్ చేసుకునే విధానం :
ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చెయ్యాలి.

లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Sign-Up పై క్లిక్ చేయాలి.


- ముందు ఓటర్ గా నమోదు అయిన వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. 6 అంకెల OTP ఎంటర్ చేసి Verify OTP పై క్లిక్ చేయాలి.
- ఓటర్ కార్డు నెంబర్ ఉంటే I Have EPIC Number, లేకపోతే I Don’t Have EPIC Number పై క్లిక్ చేయాలి. I Don’t Have EPIC Number పై క్లిక్ చేస్తే First Name, Last Name, Email, Password, Confirm Password డేటా ఇవ్వాలి. I Have EPIC Number పై క్లిక్ చేస్తే EPIC Number, Email, Password, Confirm Password వివరాలు ఇవ్వాలి. Registration Done Successfully అని వస్తే అయినట్టు.
కొత్తగా ఓటర్ రిజిస్ట్రేషన్ చేయు విధానము :
ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇప్పటికే అకౌంట్ ఉన్నట్టయితే లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి లేదంటే Sign up ఆప్షన్ పైన క్లిక్ చేయండి



లాగిన్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే కింది విధంగా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది


Sign up పైన క్లిక్ చేసిన తరువాత కింది విధంగా ఇది ఓపెన్ అవుతుంది ఇందులో మీ వివరాలను నమోదు చేసి ఎలక్షన్ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.


క్రియేట్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి, Captcha కోడ్ ఎంటర్ చేసి, Request OTP పైన క్లిక్ చెయ్యండి.


OTP request చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి Verify & Login పైన క్లిక్ చెయ్యండి.


లాగిన్ అయిన తరువాత కింది విధంగా Home Page ఓపెన్ అవుతుంది. ఇప్పుడు New Registration for general electors ఆప్షన్ లో ఉన్న Form 6 ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
ఒకవేల మీరు ఆఫ్లైన్ లో అప్లై చెయ్యాలి అంటే Download ఆప్షన్ పైన క్లిక్ చేస్తే, అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ అవుతుంది. అది ఫిల్ చేసి, మీ దగ్గర్లోని సచివాలయంలో కానీ, మీ సేవ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు


New Registration పైన క్లిక్ చేసిన తరువాత, కింది విధంగా electoral registration పేజీ ఓపెన్ అవుతుంది.


మొదటగా మీ state/ రాష్ట్రాన్ని ఎంచుకోండి


తరువాత మీ జిల్లా ను ఎంచుకోండి.


తరువాత మీ అసెంబ్లీ constituency వివరాలను నమోదు చెయ్యాలి.


State, District మరియు Assembly Constituency వివరాలు నమోదు చేసిన తర్వాత Next పైన క్లిక్ చెయ్యండి.


తరువాత Personal Details వివరాలు నమోదు చెయ్యాలి. ఇందులో మీ First , Last Name & Surname వివరాలను నమోదు చేయాలి.


మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో గ్రాఫ్ ను అప్లోడ్ చేసి, save పైన క్లిక్ చేయాలి.


మీ ఫోటో అప్లోడ్ చేసిన తరువాత next పైన క్లిక్ చేయాలి.


తరువాత మీ తండ్రి లేదా తల్లి లేదా భర్త లేదా భార్య లేదా గార్డియన్ వివరాలు నమోదు చేయాలి.


వివరాలు నమోదు చేసిన తరువాత Next పైన క్లిక్ చెయ్యండి.


తరువాత మీ కాంటాక్ట్ డీటైల్స్ ఎంటర్ చెయ్యాలి. మొదటగా మొబైల్ నంబర్ మీదా లేక మీ కుటుంబ సభ్యులకు సంభందించినదా అని సెలెక్ట్ చేసుకోవాలి. మీది అయితే Self ఆప్షన్ పైన లేదంటే Relative Mentioned Above ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.


తరువాత మొబైల్ నంబర్ పైన క్లిక్ చేసి , Send OTP పైన క్లిక్ చెయ్యండి.


Send OTP పైన క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. ఆ OTP ని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చెయ్యండి.


తరువాత మీ email ID వివరాలు నమోదు చేయండి.


తరువాత మీ ఆధార్ వివరాలు నమోదు చేయాలి, ఒకవేల ఆధార్ వివరాలు నమోదు చెయ్యడం ఇష్టం లేక పోయిన లేక నమోదు చేసే సమయంలో ఆధార్ వివరాలు లేక పోతే “I’m not able to furnish my Aadhaar number” ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.


తరువాత మీ Gender వివరాలు నమోదు చేసి, Next పైన క్లిక్ చెయ్యండి.


తరువాత మీ DoB వివరాలు నమోదు చేసి, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ( ఆధార్, పాన్, passport, ssc marks memo etc ) ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తరువాత Next పైన క్లిక్ చేయండి.


తరువాత మీ ప్రస్తుత చిరునామా (Present Address) వివరాలు నమోదు చేయాలి. ఇందులో మీ డోర్ నంబర్, స్ట్రీట్, మండలం, జిల్లా, రాష్ట్రం, పిన్ కోడ్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.


మీ చిరునామా వివరాలు నమోదు చేసిన తరువాత అందుకు సంబందించిన ప్రూఫ్ డాక్యుమెంట్ ని upload చెయ్యాలి. ఆధార్, పాస్ పోర్ట్, గ్యాస్ బిల్ లేదా బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ వంటి డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి upload చెయ్యవచ్చు. Upload చేసిన తరువాత Next పైన క్లిక్ చేయండి.


ఒక వేళ మీరు దివ్యాంగులయితే మీ Disability వివరాలు నమోదు చేయండి లేదంటే నేరుగా Next పైన క్లిక్ చేయండి.


మీ కుటుంబ సభ్యులలో ఎవరికైన ఇది వరకే ఓటర్ కార్డ్ ఉంటే ఆ వివరాలను నమోదు చేయండి లేదా నేరుగా Next పైన క్లిక్ చేయండి.


చివరగా Declaration పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో Village, State మరియు District వివరాలను ఎంచుకోండి.


తరువాత మీ place వివరాలు నమోదు చేయండి.


Next పైన క్లిక్ చేసి, మీకు కనిపించిన Captcha వివరాలు నమోదు చేయండి.


ఇప్పటి వరకు fill చేసిన వివరాలు save చెయ్యడానికి Save పైన క్లిక్ చేయండి.


Save చేసిన తరువాత Preview & Submit పైన క్లిక్ చేస్తే కింది విధంగా మీ నమోదు చేసిన వివరాలు చూపిస్తాయి.


వివరాలు అన్ని సరి చూసుకుని, అన్ని సరిగ్గా ఉంటే Submit పైన క్లిక్ చేయండి. లేదంటే కీప్ Editing పైన క్లిక్ చేసి edit చేయవచ్చు.


Submit పైన క్లిక్ చేయగానే కింది విధంగా చూపిస్తుంది. ఇందులో Yes పైన క్లిక్ చేయండి.


Submit పైన క్లిక్ చేయగానే మీ ఓటర్ అప్లికేషన్ పూర్తి అవుతుంది. అందుకు సంబంధించిన Acknowledgement number చూపిస్తుంది. ఈ వివరాలు మీరు నమోదు చేసిన మొబైల్ & Email ID లకు వస్తాయి.


ఇలా అప్లై చేసిన తరువాత BLO వారికీ అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. APPROVAL అయ్యిన తరువాత e-VOTER డౌన్లోడ్ చేసుకోవచ్చు . తరువాత వారి BLO ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఓటర్ అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు మీ reference ID తో చెక్ చేసుకోవచ్చు.
Leave a Reply