వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి అప్లై చేయడానికి కేవలం మరో రోజు మాత్రమే గడువు ఉంది.
కొత్తగా అర్హత ఉన్న లబ్ధిదారులు జూన్ 20 వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే గత ఏడాది వివిధ కారణాల చేత ineligible అయిన వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 20 వరకు అవకాశం కల్పించడం జరిగింది.
ఇక పాత లబ్ధిదారులకు సంబందించి జూన్ 21 నుంచి 23 వరకు సచివాలయాల స్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది.
ఇక ఈ పథకానికి అర్హత సాధించిన అర్హుల తాత్కాలిక జాబితాను జూన్ 28 29 తేదీలలో సోషల్ ఆడిట్ కోసం సచివాలయాలలో ప్రదర్శించడం జరుగుతుంది, ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిశీలించి అందుకు అనుగుణంగా ఏవైనా సవరణలు ఉన్నచో తుది జాబితా ను జూలై 6,7 తేదీలలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వైఎస్సార్ నేతన్న నేస్తం పూర్తి టైం లైన్స్ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు
Leave a Reply