రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అండగా నిలవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఆర్థిక సమస్యలను దూరం చేయడానికి ప్రభుత్వం ప్రతి ఏటా 24 వేల రూపాయలను వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.
గత నాలుగేళ్లలో ఈ పథకం కింద 776 కోట్ల రూపాయలను చేనేత కార్మికులకు అందించింది. ఈ ఏడాదికి గాను నేతన్న నేస్తం దరఖాస్తు ప్రక్రియ మరియు వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది.
అర్హుల మరియు అనర్హుల జాబితా సోషల్ ఆడిట్ కోసం సచివాలయంలో పొందుపరచడం జరిగింది. ఇప్పటికే నేతని నేస్తం అమౌంట్ విడుదలకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సంవత్సరానికి గాను నేతన్న నేస్తం నిధులను ఈనెల 21న (రేపు) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఏడాది నేతన్న నేస్తం పథకం కింద దాదాపు 80686 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 24 వేల రూపాయల చొప్పున రేపు బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు
Leave a Reply