రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సర్వే నవంబరు 29 నుంచి ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి తేది వరకు ఈ సర్వే కొనసాగుతుంది.
ఏపీ ఎంఎస్ఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ సర్వే నిర్వహిస్తోంది.
ఈ సర్వే కోసం ‘ఎంఎస్ఎంఈ సర్వే అండ్ సపోర్ట్’ అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వే నిర్వహించనున్నారు.
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ డెవల్‌పమెంట్ కమిషనర్ల ద్వారా జిల్లా పరిశ్రమల కేంద్రాలు, జిల్లా కలెక్టర్లు సర్వే పురోగతిని పర్యవేక్షిస్తారు. జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు సమన్వయంతో పని చేసి ఈ సర్వేని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఇండస్ట్రియల్ పార్కులను ఈ సర్వే పరిధిలోకి తీసుకురానున్నారు.
సర్వే లక్ష్యాలు..
- రాష్ట్రంలోని అన్ని ఎంఎస్ఎంఈ డేటాబేస్ అభివృద్ధి.
- వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తల నైపుణ్యాల అభివృద్ధి, ఇతర సేవలు.
- నమోదు వల్ల వివిధ రకాల ప్రోత్సహకాలు పొందేందుకు అర్హత.
- ‘ర్యాంప్’ ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు అవగాహన కల్పించి, వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు వివిధ కార్యక్రమాలు.
- రాష్ట్రంలో బిజినెస్ డెవల్‌పమెంట్ సర్వీస్ (బీడీఎస్) ప్రొవైడర్స్‌ను తయారు చేయడం.
MSME Survey App
MSME survey login details
Ex :: Sachivalayam Code – Designation Code
11290000-MP
11290000-DA
PS Gr5 = Sec Code-PS5
PSDA =Sec Code-DA
WEA =Sec Code-WEA
VRO =Sec Code-VRO
MP =Sec Code-MSK
VS =Sec Code-VSA
Password is common for all i.e., Admin@1234
MSME survey User Manual
MSME survey GO Copy
సర్వే ఎందుకు:-
ఈ సర్వే అనేక సంస్థల లోని వివిధ అంశాలపై విలువైన సమాచారం అందిస్తుంది మరియు విధాన రూపకల్పన,లక్ష్యాలు మరియు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
సర్వే యొక్క ప్రయోజనాలు:-
1) అవసరమైన సంస్థలకు స్టాండప్ ఇండియా, CGTMSE, PMEGP, PMFME, ముద్ర, P.M విశ్వకర్మ మొదలైనప్రభుత్వ పథకాల కింద ఆర్థిక సహాయం అందించడం.
2) సంస్థలకు మార్కెటింగ్ సహాయం అందించడానికి, ఆలస్యమైన ఆర్థిక చెల్లింపుల సమస్యలను పరిష్కారం కొరకు.
3) అవసరైన సంస్థలకు ZED, ISO 9000, ISI మొదలైన నాణ్యమైన ధృవ పత్రాలను పొందడంలో సహాయం చేయడం.
4) అర్హత ఉన్న యూనిట్లకు ఇండస్ట్రియల్ పార్కులు / MSME పార్కులు / ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లలో భూమిప్లాట్ల కేటాయింపు.5) విధాన అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల లో, ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కొరకు.
సర్వే ఎవరు చేస్తారు:-
గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బందికి సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, ఏఎన్ఎం, విలేజ్ సర్వే అసిస్టెంట్, మహిళా పోలీస్, పంచాయతీ సెక్రటరీ, వీఆర్ ఓ,ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ తదితరులు మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారు.
సర్వే కోసం అవసరమైన పత్రాలు:-
- తప్పనిసరి పత్రాలు (అందుబాటులో ఉంటే)
- ప్రమోటర్ పాన్ కార్డ్,ఆధార్ కార్డ్ నంబర్
- బ్యాంక్ ఖాతా
- గత నెల విద్యుత్ బిల్లు
- GST
- ట్రేడ్ లైసెన్స్
- ఫ్యాక్టరీ లైసెన్స్
- ఐటీ రిటర్న్స్
- ఇమెయిల్ ID
- లేబర్ రిజిస్ట్రేషన్ కాపీ
- Udyam సర్టిఫికేట్ / Udyam రిజిస్ట్రేషన్ నెం.
MSME సర్వే కోసం అవసరమైన సమాచారము మరియు వివరాలు:-
1. సంస్థ వివరాలు (యూనిట్ పేరు & చిరునామా)
2. ప్రమోటర్ వివరాలు (ప్రమోటర్ పేరు)
3. పెట్టుబడి & టర్నోవర్ వివరాలు (భూమి, భవనం & యంత్రాలు / పరికరాల ధర & టర్నోవర్)
4. ఉత్పత్తి / సేవా వివరాలు (తయారీ ఉత్పత్తులు, సేవలు / వాణిజ్య కార్యకలాపాలు)5. Udyam నమోదు కోసం సమ్మతి (Udyam సర్టిఫికేట్)6. అనుమతులు/ లైసెన్స్లు / పవర్ కనెక్షన్ యొక్క వివరాలు.
7. బ్యాంక్ రుణాల వివరాలు (బ్యాంక్ లోన్ ఇది వరకే పొంది వుంటే లేదా లోన్ లు ఇంకా అవసరమైతే వాటి వివరాలు)
8. ఉపాధి మరియు ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న కార్మికుల సంఖ్య (పురుషులు & స్త్రీలు ) & అవసరమైన కార్మికులు
9. మార్కెట్ వివరాలు (ఈ-మార్కెటింగ్ ద్వారా / ఏజెంట్ల ద్వారా / పంపిణీ వ్యవస్థ ద్వారా / రిటైల్ గా / హోల్సేల్/ NDC నెట్ వర్క్ మొదలైనవి ఏమైనా వుంటే)
పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించిన అన్ని సాధారణ వ్యాపార సంస్థలు మరియు MSME యూనిట్లుసర్వేలో నమోదు చేయబడతాయి.
వ్యాపార కార్యకలాపాలు అనగా :-
కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాలు, చికెన్ మరియు మటన్ దుకాణాలు, కూల్ డ్రింక్ దుకాణాలు, పండ్లదుకాణాలు, పాల ఉత్పత్తుల దుకాణాలు, హోటళ్లు, టిఫిన్ కేంద్రాలు, బుక్ స్టాల్, కూరగాయల దుకాణాలు, పూలదుకాణాలు, పుట్ వేర్ షాపులు, క్లాత్ వేర్ షాపులు వంటి అన్ని రకాల రిటైల్/హోల్ సేల్ ట్రేడింగ్ దుకాణాలు,సిమెంట్ దుకాణాలు, స్టీల్ దుకాణాలు, మొబైల్ దుకాణాలు మొదలైనవి..
సేవా కార్యకలాపాలు అనగా :-
మొబైల్ రిపేరింగ్, టీవీ రిపేరింగ్, జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్, మోటార్ సైకిల్ రిపేర్ షాప్ లు, పంచర్షాపులు, మోటార్ రివైండింగ్ షాపులు, వెల్డింగ్ వర్క్లు, షీట్ సెంటరింగ్ చేయడం, ఫంక్షన్ హాళ్లు, టెంట్ హౌస్ లు,హోటళ్లు, క్యాటరర్లు, వుడ్ ప్లెయినింగ్ వర్క్లు, స్టిక్కరింగ్ కార్యకలాపాలు, వీడియో మరియు ఆడియో గేమ్దుకాణాలు, ఫోటో స్టూడియోలు, పిండి మరలు, వెట్ గ్రైండింగ్ (దోశ పిండి, మసాలా గ్రౌండింగ్ లాంటివి ), డిష్నెట్వర్క్లు, టైలర్ షాపులు, బ్యూటీ పార్లర్, బార్బర్ షాపులు, ఆసుపత్రులు, ఎలక్ట్రికల్ వర్క్లు, గృహోపకరణాలమరమ్మతులు, ప్రింటింగ్ మరియు ఆఫ్సెట్, ట్రావెల్ ఆఫీసులు, పౌల్ట్రీ ఫారన్లు, డైరీ ఫారమ్లు మొదలైనవి.
తయారీ కార్యకలాపాలు అనగా :-
సిమెంట్ ఇటుకల తయారీ, ఎర్ర ఇటుకల తయారీ, మినరల్ వాటర్ తయారీ, ఫర్నిచర్ తయారీ, పేపర్ ప్లేట్లుమరియు కప్పుల తయారీ, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, స్టోన్ క్రషర్లు, అన్ని ప్లాస్టిక్ సంబంధిత పరిశ్రమలు,అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వేరుశనగ డికార్టికేటర్లు, ఫర్నిచర్ తయారీ, గ్రానైట్ కటింగ్ మరియు పాలిషింగ్యూనిట్లు, హాండ్ లూమ్స్, పవర్ లూమ్స్, రెడీమేడ్ దుస్తులు తయారీ, ఐస్ క్రీం తయారీ మొదలైనవి .
Leave a Reply