దేశంలో ఆడ శిశువుల జననాల రేటును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి మిషన్ శక్తి రూప కల్పన చేసింది.
ఎవరికైనా రెండోసారి గర్భం దాల్చినపుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి 6000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2022 ఏప్రిల్ నెల నుండి ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు తెలిపారు. రెండో కాన్పులో కవలలు పుట్టి అందులో ఒక అమ్మాయి ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.
బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా నగదును మహిళకు చెల్లిస్తారు. మొదటిసారి గర్భం దాల్చిన వారికి ఇదివరకే మంత్రి మాతృ వందన యోజన కింద ఇప్పటికే 5000 చెల్లిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిని సవరిస్తూ కేంద్రం మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పు కి కూడా అమౌంట్ చెల్లించనుంది.
మిషన్ శక్తి పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చాలని ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.
మాతృ వందన యోజన పథకం సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం కింది లింక్ చెక్ చేయండి
Leave a Reply