ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు ఏప్రిల్ మొదటి వారంలోపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఎం ఆదేశించారు.
మొత్తం 2800 కోట్ల మేర బిల్లులకు మోక్షం లభించనుంది. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం పథకంలో భాగంగా ప్రజాప్రతినిధులు గ్రామీణ ప్రాంతాలను సందర్శించినప్పుడు గ్రామీణ ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు ఉపాధి హామీ బిల్లులు చెల్లించడం లేదని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా ఎమ్మెల్యేలు ప్రస్తావించగా దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఈ బిల్లులను త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొన్నిచోట్ల గత ఏడాది బిల్లులను కూడా ఇప్పటివరకు క్లియర్ చేయలేదు. అయితే ఏప్రిల్ మొదటి వారం లోపు వీటికి కూడా మోక్షం లభించనున్నట్లు తెలుస్తుంది.
గ్రామీణ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి పంచాయతీల పరిధిలో అన్ని బిల్లులను క్లియర్ చేయాలని, వారికి వెంటనే నిధులను విడుదల చేయాలని ఆదేశించడం జరిగింది.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం దినసరి వేతనాన్ని కూడా పెంచిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో 15 రూపాయల మేర పెంచి 272 రూపాయలుగా రోజువారి వేతనాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు మీ పేమెంట్ స్టేటస్ వివరాలు కోసం కింది లింకును చూడండి
Leave a Reply