మే రెండో వారంలో మత్స్యకార భరోసా..నేటి నుంచి వేట నిషేదం

మే రెండో వారంలో మత్స్యకార భరోసా..నేటి నుంచి వేట నిషేదం

ఏటా వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, మత్స్యకారులుగా జీవనోపాధి కొనసాగిస్తున్న మృత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ సమయంలో వీటి పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కావున ఈ సమయంలో ఉపాధి కోల్పోయే అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ఈ నగదు ద్వారా జీవన భృతి లభిస్తుంది. ఒక్కో కుటుంబానికి దాదాపు రూ 10 వేల వరకు భృతి అందుతుంది. దీనితో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని కూడా మత్స్యకారులకు అందిస్తుంది.

మే నెలలో విడుదల కానున్న వైయస్సార్ మత్స్యకార భరోసా 2023-24 సంవత్సరానికి గాను టైం లైన్స్ మరియు గైడ్ లైన్స్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 17 న క్షేత్రస్థాయిలో బోట్లను పరిశీలించనున్నారు. సచివాలయం నవశకం లో 20 నుంచి 24 తేదీల మధ్య అర్హులైన వారి డేటా ఎంటర్ చేస్తారు. 25న ప్రాథమిక జాబితా విడుదల చేస్తారు. వీటిని సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శిస్తారు. ప్రాథమిక జాబితాలో ఏమైనా సవరణలు, అబ్జెక్షన్స్ ఉన్నా వాటిని పరికరంలోకి తీసుకొని ఏప్రిల్ 30న తుది జాబితా విడుదల చేస్తారు. జాబితాలను రైతు భరోసా కేంద్రం మరియు సచివాలయాల వద్ద డిస్ప్లే చేస్తారు.మే 1,2 తేదీలలో EKYC ప్రక్రియ ఉంటుంది.. మే రెండవ వారంలో మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల కానుంది.

YSR Matsyakara Bharosa Release Date: 2nd week of May

ఇందుకు సంబందించిన పూర్తి గైడ్లైన్స్ మరియు టైం లైన్స్ కింద ఇవ్వబడ్డాయి.

YSR Matsyakara Bharosa 2023 Time lines

DescriptionTimeline
Video conference with all concerned field level officers along with GSWS team10th April 2023
(4.00 PM to 5.00 PM)
Publicity on imposing marine fishing ban and date of enumeration 10th -14th April 2023
Orientation to staff on enumeration at district/division level                 15th – 16th April 2023
Enumeration and data collection 17th April 2023
Data verification and keep ready for Data entry                    18th -20th April 2023
Data entry in YSR Navasakam Portal 20th-24th April 2023
Publication of list of preliminary beneficiaries in GSWS/RBKs for calling objections                                             25th April 2023
Receiving objections at GSWS/RBKs on list published            25th-27th April 2023
Redresses of objections                                                               28th -29th April 2023
Final data entry completion and generation of list                        30th April 2023
Taking approval of District Collector 30th April 2023
eKYC of the approved data                                                        1St to 2nd May 2023
Distribution of relief to eligible crew through DBT  
(as per the calendar issued by Govt)
In the Month of May 2023
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page