వైఎస్ఆర్ మత్స్యకార భరోసా- YSR Matsyakara Bharosa Scheme

#

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా-YSR Matsyakara Bharosa Scheme






వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 వయసు లోపు మత్స్యకారుల గా జీవనోపాధి కొనసాగిస్తున్న 1.32 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనుంది . సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. దీంతో ఉపాఽధి కోల్పోయే అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ఈ నగదు ద్వారా జీవన భృతి లభిస్తుంది. ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.10వేల వరకు భృతి అందుతుంది. దీనితో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని కూడా మత్స్యకారులకు అందిస్తుంది.

పథకం అమలు

ప్రతి ఏటా రెండు నెలల పాటు చేపల వేట ను ప్రభుత్వం నిషేధిస్తుంది. చేపల పెంపకం మరియు పునరుత్పత్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా తేదీలను ప్రకటిస్తుంది. ఈ సమయంలో వేటకు వేళ్ళని వారి జీవనోపాధి కోరకు ప్రతి ఏటా ప్రభుత్వం 10 వేలు ఇస్తుంది. గతంలో ఇస్తున్న 4000 ను 10 వేల కు ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. దీంతో పాటు డీజిల్ పై రాయితీ ని కూడా ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందిస్తుంది.

వైయస్ఆర్ మత్స్యకర భరోసా పథకం వివరాలు

పేరు ఏపీ వైస్సార్ మత్స్యకార భరోసా పథకం
ప్రారంభించింది వైస్సార్ జగన్ మోహన్ రెడ్డి
లబ్దిదారు రాష్ట్ర మత్స్యకారులు
ఆబ్జెక్టివ్ ఫిషింగ్ ప్రోత్సాహకాలు మరియు మంచి సౌకర్యాలు కల్పించడం
అధికారిక వెబ్‌సైట్ https://www.ap.gov.in/

పథకం యొక్క ప్రయోజనాలు

ఈ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని జాలర్లకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి:

⦿ వైయస్ఆర్ మత్స్యకర భరోసా ద్వారా ఏటా పది వేలు
⦿ గ్రహీతలకు డీజిల్ పై లీటరుకు రూ .6.03 బదులు లీటరుకు రూ .9 చొప్పున పెంచిన డీజిల్ సబ్సిడీ లభిస్తుంది.
⦿ ఈ ప్రణాళిక ద్వారా మొత్తం 1,32,332 కుటుంబాలు లాభపడుతాయి.
⦿ మరణించిన మత్స్యకారుల కుటుంబాల ఇచ్చే ఎక్స్ గ్రేషియా రూ .5 లక్షలకు అదనంగా రూ .10 లక్షలకు పెంచడం జరిగింది . ఇది 18 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మత్స్యకారులకు మాత్రమే వర్తిస్తుంది.

అర్హత ప్రమాణం

పథకం కోసం దరఖాస్తు చేయడానికి మీరు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలలో ఈ క్రింద పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలను పాటించాలి: -

⦿ దరఖాస్తుదారు వృత్తి ద్వారా మత్స్యకారుడిగా ఉండాలి
⦿ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.

కావలసిన పత్రాలు

మీ దరఖాస్తు ఫారం సమర్పించడానికి ఈ క్రింది పత్రాలు అవసరం: -

⦿ ఆధార్ కార్డు
⦿ ఓటరు ఐడి కార్డు
⦿ పాస్పోర్ట్ సైజు ఫోటో
⦿ వృత్తి ప్రమాణపత్రం

వైయస్ఆర్ మత్స్యకర భరోసా పథకం యొక్క దరఖాస్తు విధానం

పథకం కోసం దరఖాస్తు చేయడానికి మీరు క్రింద ఇచ్చిన సాధారణ విధానాన్ని అనుసరించాలి: -

కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో అధికారులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తించిన లబ్ధిదారులను వివరాలను సేకరించి అర్హులైన వారికి ప్రతి ఏటా ప్రభుత్వం నగదు అందిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులను గుర్తించడం జరిగింది.

లబ్ధిదారుల జాబితా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు మరియు 10000 రూపాయల చెల్లింపు నేరుగా ఫిషింగ్ యొక్క సీజన్లో వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.



#

JOIN Our Govt Schemes Telegram Group

#

JOIN Our Telangana Telegram Group

  • #
  • #
  • #
  • #