Kapu Nestham 2023-24 Release Date : వైఎస్ఆర్ కాపు నేస్తం అమౌంట్ తేదీ ఖరారు

Kapu Nestham 2023-24 Release Date : వైఎస్ఆర్ కాపు నేస్తం అమౌంట్ తేదీ ఖరారు

ఏపీలో కాపు మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. నేడు కాపు నేస్తం పథకం (Kapu Nestham Scheme)లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (Ys Jagan) చేతుల మీదుగా అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన వారికి ఆర్థిక సాయం జమ చేయనున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తోంది.

ఈ కాపు నేస్తం పథకానికి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులైన మహిళలు మాత్రమే అర్హులు. అలాగే కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10,000/- లోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో రూ.12,000/- వేల లోపు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ పథకానికి సంబంధించి కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి లోదా మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు, ఆటో, టాటాఏస్‌, ట్రాక్టర్‌ వంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చని ప్రభుత్వం చెబుతోంది. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పుటికీ ఈ పథకానికి అర్హులుగా ఉంటారు.

కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హులు. ఈ పథకానికి పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంకే ఎక్కువ స్థలం ఉన్న వారు అనర్హులు. కుటుంబంలో ఎవ్వరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండొద్దు… ప్రభుత్వ పెన్టన్‌ పాందుతున్న వారు కూడా అనర్హులు. అంతేకాదు కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తే ఈ పథకానికి అర్హులు కాదు. ఆధార్‌ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, వయసు నిర్దారణ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

వైయస్సార్ కాపు నేస్తం 2023 పేమెంట్ స్టేటస్

వైయస్సార్ కాపు నేస్తం పేమెంట్ స్టేటస్ వివరాలు కింది లింక్ లో ఇవ్వబడిన ప్రాసెస్ ద్వారా ఆన్లైన్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

డబ్బులు అకౌంట్‌లో పడగానే లబ్లిదారుల మొబైల్‌కు కూడా మెసేజ్ వస్తుంది. ఒకవేళ అకౌంట్‌లో డబ్బులు పడకపోతే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించగలరు.

Click here to Share

2 responses to “Kapu Nestham 2023-24 Release Date : వైఎస్ఆర్ కాపు నేస్తం అమౌంట్ తేదీ ఖరారు”

  1. T.chandrakala Avatar
    T.chandrakala

    Kapu nestham scheme

  2. Pasala Jayaprakash Reddy Avatar
    Pasala Jayaprakash Reddy

    We are not received kapu skeem
    3 times alped but not accepted

    My mother adhar number wrong enter at sever place chek and resolve sir tq

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page