Kapu Nestham 2023-24: కాపు నేస్తం EKYC ప్రక్రియ ప్రారంభం, అమౌంట్ తేదీ ఖరారు

Kapu Nestham 2023-24: కాపు నేస్తం EKYC ప్రక్రియ ప్రారంభం, అమౌంట్ తేదీ ఖరారు

ఏపీలో ఆగస్ట్ 22 న విడుదల కానున్న వైఎస్ఆర్ కాపు నేస్తం [Kapu Nestham 2023-24] పథకం కి సంబంధించి సచివాలయం స్థాయిలో బెనిఫిషరీ ఔట్రీచ్ అనే ఆప్ ద్వారా ఈ కేవైసీ అనగా థంబ్ లేదా బయోమెట్రిక్ తీసుకునే ఆప్షన్ ను సచివాలయ శాఖ విడుదల చేసింది. అదే విధంగా లబ్ధిదారుల తుది జాబితా విడుదల చేశారు.

ప్రారంభమైన లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ [Kapu Nestham EKYC 2023-24 ]

సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ నమోదు చేస్తున్నారు. లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా మీ సచివాలయంలో కానీ లేదా మీ వాలంటీర్ ను సంప్రదించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

బెనిఫిషియరీ ఔట్రీచ్ యాప్ మరియు ఈ కేవైసీ చేయు పూర్తి విధానం కింది లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి. ఈకేవైసీ కొరకు ఆగస్టు 20 చివరి తేదీ.

Download Beneficiary Outreach app for EKYC

కాపు నేస్తం జాబితా NBM పోర్టల్ లో విడుదల [ Kapu Nestham 2023-24 Final Eligible List ]

మరోవైపు సచివాలయం ఎన్.బి.ఎం అనే పోర్టల్ ద్వారా లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారులు NBM పబ్లిక్ పోర్టల్ ద్వారా నేరుగా తమ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

ఎవరికైతే తుది జాబితాలో పేరు ఉంటుందో వారు తప్పనిసరిగా థంబ్ వేసి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ వివరాలను కింది లింక్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేయగానే మీకు మీ వివరాలు కనిపిస్తాయి.

Kapu Nestham 2023-24 Eligibility List

Kapu Nestham 2023-24
Kapu Nestham 2023-24 NBM

వైఎస్సార్ కాపు నేస్తం పథకం గురించి షార్ట్ గా [About Kapu Nestham Scheme in short ]

రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కాపు వర్గానికి చెందిన మహిళలకు ప్రతి ఏటా 15000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కాపు నేస్తం పథకం ద్వారా అందిస్తుంది.

ఆగస్టు 1 2023 నాటికి ఈ వయసు అనేది లెక్కిస్తారు. కాపు, బలిజ, ఒంటరి మరియు తెలగ కులాలకు చెందిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. తప్పనిసరిగా లబ్ధిదారులు రైస్ కార్డు కలిగి ఉండాలి.

అదేవిధంగా తమ కులాన్ని ధ్రువీకరించే కుల దృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి.

Kapu Nestham Date 2023 : August 22nd

ఈ ఏడాది వైయస్సార్ కాపు నేస్తం పథకానికి సంబంధించిన నగదును ముఖ్యమంత్రి ఆగస్టు 22 న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సచివాలయాల స్థాయిలో సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అనగా థంబ్ తీసుకునే ప్రక్రియ చేపడుతున్నారు. కాబట్టి సదరు లబ్ధిదారులు మీ సచివాలయంలో గాని లేదా వాలంటీర్ ని గాని సంప్రదించండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page