రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు సంబంధించిన వారికి ప్రతి ఏటా అందిస్తున్నటువంటి 15వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ కాపు నేస్తం అమౌంట్ ఈరోజు ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయడం జరుగింది.
3,57,844 మంది మహిళల ఖాతాలో 15 వేలు జమ
రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది మహిళలకు 15 వేల చప్పున 536.77 కోట్ల రూపాయలను నేడు ముఖ్యమంత్రి జమ చేశారు.
వరుసగా నాలుగో ఏడాది మహిళల ఖాతాలో 15 వేల రూపాయలను ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేశారు.
వైయస్సార్ కాపు నేస్తం 2023 పేమెంట్ స్టేటస్
వైయస్సార్ కాపు నేస్తం పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ స్టేటస్ ను లబ్ధిదారులు కింది విధానంలో చెక్ చేయవచ్చు.
Step 1. ముందుగా కింద ఇవ్వబడినటువంటి లింకు కి వెళ్లాల్సి ఉంటుంది
Step 2. Scheme దగ్గర వైఎస్సార్ కాపు నేస్తం అని ఎంచుకోండి
Step 3. Year దగ్గర 2023-24 అని ఎంచుకోండి
Step 4. UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ సంఖ్య ను ఎంటర్ చేయండి.
Step 5. తర్వాత captcha కోడ్ లో ఇవ్వబడిన అంకెలను యధావిధిగా ఎంటర్ చేయండి.
Step 6. ఆ తర్వాత get OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి ఒక OTP వస్తుంది.
Step 7. OTP ని ఎంటర్ చేసి గేట్ డీటైల్స్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలు చూపిస్తాయి.
Note: పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపించినప్పటికీ మీకు అమౌంట్ ఇంకా పడకపోతే వేయిట్ చేయండి లేదా మీ సచివాలయంలో సంప్రదించండి. అదేవిధంగా మీ ఆధార్ కి npci లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి.
స్క్రీన్ షాట్ తో పాటు పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తే పూర్తి ప్రాసెస్ కింది లింక్ లో ఇవ్వబడింది. చెక్ చేయండి.
Leave a Reply