వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి గత శనివారం విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలకు ఏటా 15 వేల రూపాయలు జమ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికీ తమ ఖాతాలో అమౌంట్ జమ కాలేదని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమౌంట్ ఎందుకు పడలేదు, ఎప్పుడు పడుతుంది మరియు స్టేటస్ ఎలా చెక్ చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వరుస సెలవుల నేపథ్యంలో అమౌంట్ ఆలస్యం
అమౌంట్ ను ముఖ్యమంత్రి శనివారం అనగా సెప్టెంబర్ 16 న బటన్ నొక్కి విడుదల చేశారు అయితే శనివారం సగం రోజు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి కాబట్టి ఆరోజు అమౌంట్ పడదు. మరుసటి రోజు ఆదివారం మరియు సోమవారం వినాయక చవితి సందర్భంగా బ్యాంకులు సెలవు లో ఉంటాయి.
కాబట్టి పేమెంట్స్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే అందరికీ అమౌంట్ పడటానికి మరో వారం పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది పలు కారణాల వలన వివిధ సంక్షేమ పథకాల అమౌంట్ 15 రోజులు పైనే ఆలస్యం అయిన విషయం మనకు తెలిసిందే. ఇదే ఈ పథకానికి కూడా వర్తించే అవకాశం లేకపోలేదు.
కాపు నేస్తం అమౌంట్ పడిందా? Online Poll
కాపు నేస్తం అమౌంట్ పడిందా లేదా అనే విషయంపై లబ్ధిదారుల అవగాహన కోసం ఆన్లైన్ పోల్ నిర్వహిస్తున్నాము. మీకు అమౌంట్ పడితే అయింది అని ఇంకా పడకపోతే పడలేదు అని ఓట్ చేయగలరు.
కాపు నేస్తం 2023 పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
వైయస్సార్ కాపు నేస్తం పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ స్టేటస్ ను లబ్ధిదారులు కింది విధానంలో చెక్ చేయవచ్చు.
Step 1. ముందుగా కింద ఇవ్వబడినటువంటి లింకు కి వెళ్లాల్సి ఉంటుంది
Step 2. Scheme దగ్గర వైఎస్సార్ కాపు నేస్తం అని ఎంచుకోండి
Step 3. Year దగ్గర 2023-24 అని ఎంచుకోండి
Step 4. UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ సంఖ్య ను ఎంటర్ చేయండి.
Step 5. తర్వాత captcha కోడ్ లో ఇవ్వబడిన అంకెలను యధావిధిగా ఎంటర్ చేయండి.
Step 6. ఆ తర్వాత get OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి ఒక OTP వస్తుంది.
Step 7. OTP ని ఎంటర్ చేసి గేట్ డీటైల్స్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలు చూపిస్తాయి.
Note: పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపించినప్పటికీ మీకు అమౌంట్ ఇంకా పడకపోతే వేయిట్ చేయండి లేదా మీ సచివాలయంలో సంప్రదించండి. అదేవిధంగా మీ ఆధార్ కి npci లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి.
స్క్రీన్ షాట్ తో పాటు పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తే పూర్తి ప్రాసెస్ కింది లింక్ లో ఇవ్వబడింది. చెక్ చేయండి.
Leave a Reply