జూలై నెల కి సంబందించి ఇప్పటికే ఉచిత పంటల బీమా అమౌంట్ విడుదల చేసిన ప్రభుత్వం మరో నాలుగు పథకాల అమౌంట్ ను కూడా ఇదే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు
ఈ నెలలో విడుదల కానున్న పథకాల వివరాలు మరియు తేదీలు ఇవే.
- జగనన్న తోడు (మొదటి విడత) – జూలై 18
- నేతన్న నేస్తం – జూలై 21
- R5 జోన్ మరియు CRDA పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులు – జూలై 24
- వైఎస్సార్ సున్నా వడ్డీ (డ్వాక్రా మహిళలకు) – జూలై 26
- జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత) – జూలై 28
పైన తెలిపిన పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
జగనన్న విదేశీ విద్యా దీవెన
ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి
నేతన్న నేస్తం
ఏపీలోని చేనేత కుటుంబాలలో సొంత మగ్గం కలిగి అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని నేతన్న నేస్తం పథకం ద్వారా నేరుగా నేతన్నలకు అందజేస్తోంది. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి.
జగనన్న తోడు
జగనన్న తోడు కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు రూ.10 వేలు రుణం అందిస్తుంది. అధిక వడ్డీ భారం నుంచి చిరు వ్యాపారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి
వైఎస్సార్ సున్నా వడ్డీ
ఏపీలో డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళల అకౌంట్‌లలో జమ చేస్తుంది. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram లో జాయిన్ అవ్వండి
Leave a Reply