Jal Jeevan Mission Volunteer Survey: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా త్రాగు నీటి కుళాయిలకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే చేయడం కోసం కొత్తగా అప్డేట్ అయిన Beneficiary Outreach App లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో ఉన్న వారికి ఈ సర్వేను పూర్తి చేయవలసి ఉంటుంది.
జల్ జీవన్ మిషన్ సర్వే చేయు విధానం :
Jal Jeevan Mission Survey Process :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి.
Step 2 : ఓపెన్ చేసిన తరువాత గ్రామ లేదా వార్డు వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి బయోమెట్రిక్ / ఫేసు / ఐరిస్ ద్వారా లాగిన్ అవ్వాలి.
Step 3 : లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో కింద చూపిన విధంగా Jal Jeevan Mission అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : తరువాత పేజీలో Data అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత మీ సచివాలయం యొక్క క్లస్టర్‌ను ఎంచుకున్నట్లయితే వారి పరిధిలో ఉన్న జల జీవన్ మిషన్ లబ్ధిదారుల పేర్లు చూపిస్తుంది లేదా సెర్చ్ ద్వారా కూడా వెతుక్కోవచ్చు.
Step 5 : సర్వే చేయాల్సిన వారి పేరుపై క్లిక్ చేసిన తర్వాత కింద చూపిన విధంగా వారి యొక్క పూర్తి వివరాలు చూపిస్తుంది.
Step 6 : హౌస్ మ్యాపింగ్ లబ్ధిదారుల, ఆధార్ నెంబరు , హౌస్ మ్యాపింగ్ ఐడి వివరాలు చూపిస్తుంది తరువాత అందులో పంచాయతీ పేరు, గ్రామం పేరు, హేబిటేషన్ పేరు, పథకం పేరు సెలెక్ట్ చేసుకోవాలి.
Step 7 : తరువాత ట్యాప్ కనెక్షన్ కలిగి ఉన్నారా ? అనే ప్రశ్నకు కు లబ్ధిదారుని అడిగి అవును / లేదు లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అవును అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్యాప్ కనెక్షన్ రకము ప్రభుత్వము లేదా ప్రైవేట్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించినట్టయితే టాపు కనెక్షను ఇవ్వబడిన సంవత్సరము
- Before FY 2023-2024
- During FY 2023-2024
ఇంటి రకమును
- పూరి గుడిసె
- పెంకుటిల్లు
- రేకుల ఇల్లు
- డాబా ఇల్లు
- అపార్ట్మెంట్ లో ప్లాట్
ఎంచుకోవాలి. తరువాత ఇంటి నెంబరు ఎంటర్ చేసి House Hold Name For eKYC ని సెలెక్ట్ చేసుకొని Tap వద్ద లబ్ధిదారుని నించొని ఉండగా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.
Step 8 : ఫోటో తీసిన తర్వాత లబ్ధిదారుని eKYC చేయాలి. eKYC ను Biometric / Face / Irish / OTP ద్వారా చేయవచ్చు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత Data Saved Successfully అని సందేశం వస్తుంది. OK పై క్లిక్ చెయాలి. తర్వాత వాలంటీర్ యొక్క ఈ కేవైసీ ని పూర్తి చేసిన తర్వాత Data Saved Successfully అని సందేశం వచ్చినట్లయితే ఆ ఇంటికి జలజీవన్ సర్వే పూర్తి అయినట్టు. తర్వాత క్లస్టర్ పరిధిలో అందరికీ పూర్తి చేసినట్లయితే సర్వే పూర్తి అయినట్టు.
Leave a Reply