ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించే జగనన్న తోడు పథకం ఈ ఏడాది అమౌంట్ ను జూలై 18 న విడుదల చేయనున్న సీఎం.
ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణం లభిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది తోడు నిధులు విడుదల కార్యక్రమానికి తేదీని ఖరారు చేసింది అలాగే నిధుల మంజూరుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ద్వారా virtual గా ప్రారంభించడం జరుగుతుంది.
ఈ పథకం ద్వారా ఈ ఏడాది 5.1 లక్షల మందికి రూ.510 కోట్ల రుణాలు ఇప్పిస్తూ మరియు వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ.10.03 కోట్లు చెల్లించనున్నారు.
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ మరియు వెరిఫికేషన్ పూర్తయింది. అర్హులైన లబ్ధిదారుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగింది.
జగనన్న తోడు పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు అప్డేట్స్ కొరకు కింది లింకును క్లిక్ చేయండి.
Leave a Reply