ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను మరియు సర్టిఫికెట్ల జారిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి జగనన్న సురక్ష పథకానికి సంబంధించి జూలై 1 నుంచి నాలుగు వారాలపాటు సచివాలయాల ఆధ్వర్యంలో క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరికైనా సంక్షేమ పథకాలు,రేషన్ కార్డ్ మరియు ఏవైనా సర్టిఫికెట్ల సమస్యలు ఉంటే క్యాంపు ల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
నెలరోజుల పాటు 15004 సచివాలయాల పరిధిలో విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి గత నెల జూన్ 23 న తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
ఈ క్యాంపు ల ద్వారా 11 రకాల సర్వీసులను ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్, ఇన్కమ్, బర్త్, రేషన్ కార్డ్ , రేషన్ కార్డ్ విభజన, మ్యారేజ్ సర్టిఫికెట్, ఆధార్ లో మొబైల్ అప్డేట్ వంటి సేవలు పూర్తిగా ఉచితం. అదేవిధంగా ప్రజల నుంచి వినతులను కూడా స్వీకరించడం జరుగుతుంది. తొలి రోజు ఏకంగా 3.69 లక్షల వినతులను పరిష్కరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జగనన్న సురక్ష అంటే ఏమిటి? కార్యచరణ ఏంటి?
ప్రజలకు ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు, వినతులు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జూన్ 23న ప్రారంభించడం జరిగింది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే జూన్ 24 నుంచి వారం రోజులపాటు వాలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల సమస్యలను నమోదు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారధులు ఇంకా ఇతర ఔత్సాహికలు ఒక బృందంగా ఏర్పడి జూన్ 24 నుంచి క్లస్టర్ల వారీగా ప్రతి ఇంటిని సందర్శించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని నమోదు చేసుకొని సచివాలయాల ద్వారా ఒక టోకెన్ నెంబర్ ను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జూలై 1 నుంచి నాలుగు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు నిర్వహిస్తారు. టోకెన్ పొందని వారు కూడా నేరుగా సచివాలయాలలో సేవలు పొందే అవకాశం ఉంటుంది.
జూలై 1 నుంచి నెల రోజులపాటు క్యాంపులు
ఇంటింటి సర్వే లో భాగంగా ఏవైతే సమస్యలను తెలుసుకోవడం జరిగిందో ఆ సమస్యలను మరియు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఇతర సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు జూలై 1 నుంచి నెలరోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం క్యాంపులను నిర్వహిస్తోంది.
ఈ క్యాంపుల నిర్వహణకు మండల స్థాయి అధికారులు అయిన తాహసిల్దార్,ఈవో పిఆర్డి ఒక టీమ్ గా ఏర్పడతారు, ఇంకా ఎంపీడీవో, డిప్యూటీ తాహాసిల్దార్ మరొక టీమ్ గా ఏర్పడి ఒకరోజు పూర్తిగా ప్రతి సచివాలయంలో క్యాంపు ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజల సమస్యలను నమోదు చేసుకున్నటువంటి సమస్యలను పరిష్కరించడం మరియు సర్టిఫికెట్లను ఎటువంటి రుసుము లేకుండా వెంటనే జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు.
అర్హత ఉన్నవారికి కింది సర్వీసులను ఉచితంగా అందిస్తారు
ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనగా కుల ధ్రువీకరణ పత్రం మరియు నివాస పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మ్యుటేషన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ లో మొబైల్ నవీకరించుట, కౌలు రైతులకు సిసిఆర్సి, కొత్త రేషన్ కార్డు లేదా ఉన్న రేషన్ కార్డు ని విభజించడం, హౌస్ హోల్డ్ అంటే కుటుంబ సభ్యులను విభజించడం వంటి ప్రముఖ అంశాలపై జగనన్న సురక్ష కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే త్వరితగతిన ఈ పథకం ద్వారా పరిష్కరిస్తారు. ఈ సర్వీసులను పూర్తి ఉచితంగా ప్రభుత్వం ఈ నాలుగు వారాల పాటు అందిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 15004 క్యాంపులు
జూలై 1 నుంచి పైన పేర్కొన్న విధంగా రెండు టీంలుగా ఏర్పడినటువంటి మండల స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15004 నాలుగు సచివాలయాలలో అదే సంఖ్యలో కుసంపులను నిర్వహించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, అర్హులైన వారికి ఎటువంటి ఫీజు లేకుండా అప్పటికప్పుడు సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తారు.
ఇక గృహ సందర్శన సమయంలో వాలంటీర్లతో కూడినటువంటి బృందం సమస్యలు ఉన్నటువంటి కుటుంబానికి ఒక టోకెన్ ఇస్తుంది. ఆ టోకన్ తో పాటు ఎప్పుడు తమ సచివాలయ పరిధిలో క్యాంపులు నిర్వహిస్తారో తెలియజేసి ఆ తేదీన రావలసిందిగా కోరడం జరుగుతుంది. వారు వచ్చిన తేదీన జరిగే క్యాంపులో ప్రజల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించి కావాల్సిన సర్టిఫికెట్లను వెంటనే జారీ చేస్తారు.
జగనన్న సురక్ష పథకానికి సంబంధించి ముఖ్యమైన లింక్స్, ఫార్మ్స్ మీకోసం
1. మీ ఆధార్ ఉపయోగించి మీ సచివాలయం పరిధిలో ఎప్పుడు క్యాంపు నిర్వహిస్తారో తెలుసుకోండి
2. జగనన్న సురక్ష పథకానికి సంబంధించి అన్ని డాష్ బోర్డు లింక్స్, ఫార్మ్స్ కింది లింకు ద్వారా చెక్ చేయండి
Follow us on Telegram for regular updates
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఇంటింటి అవగాహన మరియు సర్వేను వాలంటీర్, సిబ్బంది మరియు ఇతర ఔత్సాహికులతో కూడిన బృందం నిర్వహించడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ను కింది poll ద్వారా తెలియజేయండి.
Leave a Reply