ఏపీలో ప్రజల సమస్యలే పరిష్కారంగా ప్రారంభించ బడినటువంటి జగనన్న సురక్ష పథకానికి సంబంధించి ఇప్పటివరకు 19.61 లక్షల వినదులను పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే 4978 సచివాలయాలు, 19.61 లక్షల వినతులు
రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు 4978 సచివాలయాలలో జగనన్న సురక్ష క్యాంపులను నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 1న ప్రారంభించినటువంటి జగనన్న సురక్ష క్యాంపు ల కార్యక్రమం జూలై 31 వరకు కొనసాగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యేటటువంటి ధ్రువపత్రాల కోసం ఇప్పటివరకు 22,15,876 వినతులు రాగా 19,61,388 వినతులను అప్పటికప్పుడే పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఈ పత్రాల కోసం నెల రోజులు గడువు పడుతుండగా జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా మండల అధికారులు వీటిని తక్షణమే జారీ చేస్తున్నారు.
ఈనెలాఖరు వరకు సచివాలయాలలో క్యాంపులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 15,004 గ్రామ వార్డు సచివాలయాల వద్ద జూలై 1న ప్రారంభమైనటువంటి జగనన్న సురక్ష క్యాంపులు జూలై 31 వరకు కొనసాగనున్నాయి.
ఈ క్యాంపులలో మండల స్థాయి అధికారులు రెండు విభాగాలుగా ఏర్పడి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.
ఎటువంటి రుసుము లేకుండా సర్టిఫికెట్లు, రేషన్, పెన్షన్ సహా ఇతర సమస్యలు
ఈ నాలుగు వారాల పాటు నిర్వహించే ఈ క్యాంపు లలో ప్రజలకు కావలసినటువంటి ముఖ్యమైన సర్టిఫికెట్లు , ఆధార్ సేవలు, కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డుల విభజన, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, కౌలు రైతులకు సిసిఆర్సి కార్డుల వంటి ముఖ్యమైనటువంటి సర్వీసులను పూర్తి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సచివాలయంలో సంప్రదించండి
మీకు సంక్షేమ పథకాలు అర్హత ఉన్నా అందరికపోయినా, సర్టిఫికెట్ల జారీలో సమస్యలు ఉన్నా, హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ డేటాలో తప్పులు ఉన్న లేదా రేషన్ కార్డు విభజన జరగకపోయినా ఇటువంటి అన్ని ప్రధాన సమస్యలను క్యాంపుల ద్వారా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే ద్వారా సమస్యలను గుర్తించినటువంటి వాలంటీర్ల బృందం సమస్యలు ఉన్న వారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఎవరైనా నేరుగా వెళ్లినా లేదా వాలంటీర్ ద్వారా వెళ్లినా అప్పటికప్పుడు నమోదు చేసి టోకెన్లు కూడా జారీ చేస్తున్నారు.
మీ సచివాలయంలో ఎప్పుడు సురక్ష క్యాంపు నిర్వహిస్తారు? అన్ని ఫార్మ్స్ మరియు లింక్స్ కింది పేజ్ లో చెక్ చేయండి
Leave a Reply