Jagananna Suraksha : జగనన్న సురక్ష లో భాగంగా 1.47 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం, భారీ గా స్పందన

Jagananna Suraksha : జగనన్న సురక్ష లో భాగంగా 1.47 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం, భారీ గా స్పందన

ఏపీలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందింప చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి జగనన్న సురక్ష పథకానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటిరోజు మూడు లక్షల పైగా వినతులను పరిష్కరించినట్లు తెలిపింది.

జగనన్న సురక్షలో భాగంగా ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వినతులను, సర్టిఫికెట్ల జారీ, రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ కార్డుల విభజన, ఆధార్ సేవలు మరియు రైతులకు సంబంధించినటువంటి సేవలు పైన ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు.

నెలరోజుల పాటు 15004 సచివాలయాల పరిధిలో జరిగే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఇందుకు సంబంధించి గత నెల జూన్ 23 న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా 24వ తేదీ నుంచి వాలంటీర్ల బృందం ఇంటింటి సర్వే నిర్వహించి లబ్ధిదారుల సమస్యలను నమోదు చేసుకోవడం కూడా పూర్తయింది.

ఈ క్యాంపు ల ద్వారా 11 రకాల సర్వీసులను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్, ఇన్కమ్, బర్త్, రేషన్ కార్డ్ , రేషన్ కార్డ్ విభజన, మ్యారేజ్ సర్టిఫికెట్, ఆధార్ లో మొబైల్ అప్డేట్ వంటి సేవలు పూర్తిగా ఉచితం. అదేవిధంగా ప్రజల నుంచి వినతులను కూడా స్వీకరించడం జరుగుతుంది.

జగనన్న సురక్ష లో భాగంగా 1.47 లక్షల కొత్త రేషన్ కార్డులు

ఎవరికైనా అర్హత ఉంటే రేషన్ కార్డు లభించకపోయినట్లయితే వారికి కొత్త కార్డ్ ను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా కుటుంబంలో తమతో ఎప్పుడూ విడిపోయి వేరుగా ఉంటున్న అనర్హత ఉన్న వారిని కూడా రేషన్ కార్డు నుంచి తొలగించే విభజన ఆప్షన్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈసారి ఏకంగా 1.47 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు.

కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఇప్పటికే జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారధులు ఇంకా ఇతర ఔత్సాహికలు ఒక బృందంగా ఏర్పడి జూన్ 24 నుంచి క్లస్టర్ల వారీగా ప్రతి ఇంటిని సందర్శించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని నమోదు చేసుకొని సచివాలయాల ద్వారా ఒక టోకెన్ నెంబర్ ను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జూలై 1 నుంచి నాలుగు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. టోకెన్ పొందని వారు కూడా నేరుగా సచివాలయాలలో సేవలు పొందే అవకాశం ఉంటుంది. వారికి అప్పటికప్పుడు టోకెన్ జనరేట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

కావున అర్హత ఉన్నవారు తమ ఆధార్ కార్డు మరియు ఇతర డాక్యుమెంట్లను తీసుకొని సచివాలయంలో లేదా మీ వాలంటీర్ ను సంప్రదించి ముందుగా వినతులు సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత వారికి టోకెన్ ఇవ్వగా టోకెన్ ప్రకారం క్యాంపులు జరిగే రోజున సచివాలయానికి వచ్చి అప్లికేషన్ పూర్తి చేసుకోవచ్చు.

మీ సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు నిర్వహిస్తారో కింది లింకు ద్వారా చెక్ చేయండి

జూలై 1 నుంచి ప్రారంభమైన నెల రోజుల క్యాంపులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జూలై 1 నుంచి నెలరోజుల పాటు సచివాలయాల ఆధ్వర్యంలో క్యాంపులు జరుగుతున్నాయి. తొలిరోజే 3.69 లక్షల వినతులను పరిష్కరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్యాంపుల నిర్వహణకు మండల స్థాయి అధికారులు అయిన తాహసిల్దార్,ఈవో పిఆర్డి ఒక టీమ్ గా ఏర్పడతారు, ఇంకా ఎంపీడీవో, డిప్యూటీ తాహాసిల్దార్ మరొక టీమ్ గా ఏర్పడి ఒకరోజు పూర్తిగా ప్రతి సచివాలయంలో క్యాంపు ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజల సమస్యలను  నమోదు చేసుకున్నటువంటి సమస్యలను పరిష్కరించడం మరియు సర్టిఫికెట్లను ఎటువంటి రుసుము లేకుండా వెంటనే జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు.

అర్హత ఉన్నవారికి కింది సర్వీసులను ఉచితంగా అందిస్తారు

ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనగా కుల ధ్రువీకరణ పత్రం మరియు నివాస పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మ్యుటేషన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ లో మొబైల్ నవీకరించుట, కౌలు రైతులకు సిసిఆర్సి, కొత్త రేషన్ కార్డు లేదా ఉన్న రేషన్ కార్డు ని విభజించడం, హౌస్ హోల్డ్ అంటే కుటుంబ సభ్యులను విభజించడం వంటి ప్రముఖ అంశాలపై జగనన్న సురక్ష కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే త్వరితగతిన ఈ పథకం ద్వారా పరిష్కరిస్తారు. ఈ సర్వీసులను పూర్తి ఉచితంగా ప్రభుత్వం ఈ నాలుగు వారాల పాటు అందిస్తుంది.

List of focused services

రాష్ట్ర వ్యాప్తంగా 15004 క్యాంపులు

జూలై 1 నుంచి పైన పేర్కొన్న విధంగా రెండు టీంలుగా ఏర్పడినటువంటి మండల స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15004 నాలుగు సచివాలయాలలో అదే సంఖ్యలో కుసంపులను నిర్వహించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, అర్హులైన వారికి ఎటువంటి ఫీజు లేకుండా అప్పటికప్పుడు సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తారు.

ఇక గృహ సందర్శన సమయంలో వాలంటీర్లతో కూడినటువంటి బృందం సమస్యలు ఉన్నటువంటి కుటుంబానికి ఒక టోకెన్ ఇస్తుంది. ఆ టోకన్ తో పాటు ఎప్పుడు తమ సచివాలయ పరిధిలో క్యాంపులు నిర్వహిస్తారో తెలియజేసి ఆ తేదీన రావలసిందిగా కోరడం జరుగుతుంది. వారు వచ్చిన తేదీన జరిగే క్యాంపులో ప్రజల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించి కావాల్సిన సర్టిఫికెట్లను వెంటనే జారీ చేస్తారు.

జగనన్న సురక్ష పథకానికి సంబంధించి ముఖ్యమైన లింక్స్, ఫార్మ్స్ మీకోసం

1. మీ ఆధార్ ఉపయోగించి మీ సచివాలయం పరిధిలో ఎప్పుడు క్యాంపు నిర్వహిస్తారో తెలుసుకోండి

2. జగనన్న సురక్ష పథకానికి సంబంధించి అన్ని డాష్ బోర్డు లింక్స్, ఫార్మ్స్ కింది లింకు ద్వారా చెక్ చేయండి

Follow us on Telegram for regular updates

ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఇంటింటి అవగాహన మరియు సర్వేను వాలంటీర్, సిబ్బంది మరియు ఇతర ఔత్సాహికులతో కూడిన బృందం నిర్వహించడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ను కింది poll ద్వారా తెలియజేయండి.

Loading poll …
Coming Soon
జగనన్న సురక్ష పథకానికి సంబంధించి వాలంటీర్ తో కూడిన బృందం సర్వే నిర్వహించి మీకు అవగాహన కల్పించారా?
Click here to Share

4 responses to “Jagananna Suraksha : జగనన్న సురక్ష లో భాగంగా 1.47 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం, భారీ గా స్పందన”

  1. Pandlamohan Avatar
    Pandlamohan

    Jagansuraksha policy good

  2. Deshapandi.saleem Avatar
    Deshapandi.saleem

    రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యూమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది

  3. Deshapandi.saleem Avatar
    Deshapandi.saleem

    రేషన్ కార్డు ఎలా అప్లయ్ చేసుకోవాలి

  4. Chandanala Ranganadh Avatar
    Chandanala Ranganadh

    Nenu already June lo apply chesukunna adi ippudu varthistunda lekapote malli apply chesukovala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page