జగనన్న అమ్మఒడి 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించి జూన్ 28న లబ్ధిదారులకు అమౌంట్ విడుదల చేయనున్న నేపథ్యంలో, లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రారంభమైన అమ్మ ఒడి ఈకేవైసీ ప్రక్రియ
అమ్మ ఒడి పథకానికి స్టూడెంట్స్ మరియు తల్లుల వివరాలు వెరిఫై చేసి తల్లుల ఈ కేవైసీ పూర్తి చేయటం ప్రతి ఏటా జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది.
సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ ద్వారా ఈ ఆప్షన్ను కల్పించడం జరిగింది.
అమ్మఒడి ఈ కేవైసీ కొరకు బెనిఫిషియరీ ఔటర్ లేటెస్ట్ యాప్ మరియు ఈ కేవైసీ ఎలా పూర్తి చేయాలో పూర్తి ప్రాసెస్ తో కూడిన యూజర్ మాన్యువల్ ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
స్టూడెంట్ మరియు తల్లి యొక్క వివరాలను నమోదు చేసిన తర్వాత తల్లి యొక్క ఈ కేవైసీను తీసుకోవడం జరుగుతుంది.
బయోమెట్రిక్ లేదా ఫేషియల్ గాని లేదా ఐరిస్ విధానంలో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది.
తల్లి లేని వారికి తండ్రి యొక్క బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది, తల్లిదండ్రులు ఇద్దరు లేని వారికి గార్డియన్ ఈకేవైసి తీసుకోవడం జరుగుతుంది.
అమ్మ ఒడి పథకానికి సంబంధించిన స్టేటస్ మరియు ఇతర లింక్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి
ఇక అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ తేదీన ముఖ్యమంత్రి పార్వతీపురం పర్యటనలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో 13000 రూపాయలను జమ చేయనున్నారు.
Leave a Reply