Loan Pre Close : బ్యాంక్ లోన్ ముందుగా చెల్లిస్తే లాభమా నష్టమా? పూర్తి వివరణ

Loan Pre Close : బ్యాంక్ లోన్ ముందుగా చెల్లిస్తే లాభమా నష్టమా? పూర్తి వివరణ

మీరు ఏదైనా బ్యాంకు ద్వారా రుణం పొంది ఉన్నారా? మీ పైన ఆర్థిక భారం తగ్గించుకోవడానికి దానిని గడువు కంటే ముందే చెల్లించాలి అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ వివరాలు చెక్ చేసి ముందుకు వెళ్తే మంచిది.

బ్యాంక్ లోన్ రెండు రకాలు

మనం బ్యాంక్ ద్వారా రెండు రకాల లోన్స్ ను సాధారణంగా పొందుతూ ఉంటాము.

1. EMI తో చెల్లించే లోన్స్ [scheduled] – ప్రతి నెల మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో నిర్దిష్ట అమౌంట్ ను చెల్లించే రుణాలు

2. Non – EMI లోన్స్ [unscheduled] – ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించకుండా ఒకేసారి లేదా డబ్బులు ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా చెల్లించే రుణాలు.

1. EMI రుణాలు చెల్లించేవారు ఎం చేయాలి?

మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనం ఈఎంఐ పద్ధతిలో కానీ రుణం తీసుకుని ఉన్నట్లయితే బ్యాంకులు ప్రతినెల ఒకే మొత్తంలో అమౌంట్ ను స్వీకరిస్తాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్యాంకులు ప్రతినెల జమ చేసుకునే అమౌంటు లో అసలు మరియు వడ్డీ ప్రతి నెలా ఒకేలా ఉంటుంది అనుకుంటే పొరపాటే.

మొదటి నుంచి చివరి ఇన్స్టాల్మెంట్ వరకు మనం గమనించినట్లయితే, తొలి ఇన్స్టాల్మెంట్స్ లో వడ్డీ అత్యధికంగా ఉంటుంది. అసలు అమౌంట్ తక్కువగా ఉంటుంది.

చివరి ఇన్స్టాల్మెంట్ కి వెళ్లే నాటికి అసలు అమలు తక్కువగా ఉంటుంది వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి ఇటువంటి రుణాల ముందస్తు చెల్లింపులలో జాగ్రత్తలు వహించాలి.

ఉదాహరణకు : 20 లక్షల రూపాయలను 5 సంవత్సరాలకు తీసుకున్నట్లయితే, దానికి మొత్తం వడ్డీ ఆరు లక్షలు గా ఉంటే, తొలి సంవత్సర కాలంలోనే సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకు వడ్డీ కే జమ అవుతుంది.

కాబట్టి మీరు లోన్ పేమెంట్ షెడ్యూల్ ని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ నెలలో ఉన్నారో ఆ నెల వరకు ఎంతో వడ్డీ చెల్లించారు ఎంత అసలు చెల్లించారో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఎంత అసలు మిగిలి ఉంది? ఇంకా ఎంత వడ్డీ చెల్లించాలి? ఇంకా ఎంత గడువు మిగిలి ఉందో క్యాలిక్యులేట్ చేసుకోండి.

ఆ మిగిలిన అసలు మరియు వడ్డీ మీరు ప్రస్తుతం చెల్లిస్తే మీకు లాభమా లేక మీరు అదే మొత్తాన్ని డిపాజిట్ రూపంలో వేసుకుంటే లాభమా అనేది చూసుకోవాలి. రెండిటిలో వడ్డీ పరంగా మీకు ఏది లాభము ఉంటే ఆ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. అయితే కొన్ని బ్యాంక్స్ లోన్స్ ముందస్తు చెల్లింపు పై పెనాలిటీ అనగా కొంత రుసుమును ఛార్జ్ చేస్తాయి. అవి కూడా పరిగణలోకి తీసుకొన్న తర్వాతే లోన్ ముందస్తు చెల్లింపులు లేదా మూసివేయడం చేయాలి.

Personal అనగా వ్యక్తిగత రుణాలలో సాధారణంగా తక్కువ గడువు ఎక్కువ వడ్డీ ఉంటుంది, అదే గృహ రుణాలలో ఎక్కువ గడువు కొంత తక్కువ వడ్డీ ఉంటుంది. అయినప్పటికీ గడువు ఎక్కువ ఉన్న ఏ రుణమైన ఎక్కువ వడ్డీ కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి రుణాలలో కూడా సరిగ్గా బేరీజు వేసుకొని మీకు ముందే క్లోజ్ చేస్తే లాభం అనుకుంటే ముందుకెళ్ళవచ్చు. మీకు క్యాలికులెట్ చేసుకోవడం రాకపోతే ఎవరైనా నిపుణులను సంప్రదించండి. అయితే ఇలాంటి విషయాల్లో బ్యాంకులు కొన్ని సార్లు తమ మాటల గారడీ తో బురిడీ కొట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి లేదా ఆన్లైన్ లో ఎన్నో క్యాలికులేటర్లు ఉంటాయి వాటి సహాయం కూడా పొందే ఆప్షన్ ను పరిశీలించండి.

2. Non EMI రుణాలు తీసుకున్న వారు ఏం చేయాలి?

ఒకసారి అమౌంట్ తీసుకొని మీకు డబ్బు ఉన్నప్పుడల్లా కొంత అమౌంట్ మీరు జమ చేస్తున్నా, లేక ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాలని ఉంటే, ఇటువంటి రుణాల పై మీరు త్వరగా భారం తగ్గించుకుంటే మంచిది. మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా డబ్బులు కట్టుకోవచ్చు. లేదా మీ దగ్గర ఒకేసారి ఎక్కువ మొత్తం ఉంటే పూర్తిగా తీర్చ్చివేయవచ్చు. లేదంటే వడ్డీ భారం ఎక్కువై కట్టలేని పరిస్థితి రావొచ్చు. అయితే ఇక్కడ కూడా ముందస్తు చెల్లింపులతో పెనాలిటీ చార్జీలు ఉన్నాయేమో బ్యాంకు ను అది తెలుసుకోవాలి.

లోన్స్ ముందస్తు మూసివేయడం లేదా చెల్లింపుల పై చార్జీలను పరిశీలించాలి

కొన్ని బ్యాంక్స్ లోన్స్ ముందస్తు చెల్లింపు పై పెనాలిటీ అనగా కొంత రుసుమును చార్జీల రూపంలో బాదుతూ ఉంటాయి. అవి కూడా పరిగణలోకి తీసుకొన్న తర్వాతే లోన్ ముందస్తు చెల్లింపులు లేదా మూసివేయడం చేయాలి అని నిపుణులు చెబుతున్నారు. లేనిచో లాభం కన్నా నష్టమే మిగులుతుంది.

బ్యాంకులు లోన్ తీసుకున్న మొదటి ఏడాది లోనే చెల్లిస్తే ఎక్కువ ప్రీ క్లోజర్ చార్జీలు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకు కి వడ్డీ లాస్ కాబట్టి. అయితే ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చార్జీలు లేకపోతే పైన తెలిపిన విధంగా , చార్జీలు ఉంటె ఎంత ఉన్నాయి , ఎప్పుడు కడితే చార్జీల పరంగా ఇటు వడ్డీ పరంగా కూడా మనకి లాభం ఉంటుందో లెక్క కట్టి ముందుకు వెళ్తే మంచిది.

Note: ఇందులో పేర్కొన్న విషయాలు ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్న చీఫ్ మేనేజర్ ద్వారా మీకోసం అందించబడ్డాయి. అయినప్పటికీ ఇది కేవలం సాధారణ అహగాహన కోసం మాత్రమే. మీరు తీసుకునే లోన్ ఎన్నో రకాలు ఉండవచ్చు. మీ లోన్ మరియు బ్యాంక్ కి ఈ సూచనలు వర్తించక పోవచ్చు. కాబట్టి నిపుణుల సలహా తీసుకొని లేదా నేరుగా మీ బ్యాంకు లో సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page