YSR Pension Kanuka వైస్సార్ పెన్షన్ కానుక లో భాగంగా ప్రతీ నెల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గా పెన్షన్ పంపిణి జరుగుతున్నది. పెన్షన్ పంపిణి కు సంబందించిన ముఖ్యమయిన సమాచారం ఈ పేజీ లో ఎప్పటికి అప్పుడు పోస్ట్ చేస్తూ అప్డేట్ చెయ్యటం జరుగుతుంది.
- పెన్షన్ ను పెన్షన్ దారులు ప్రతీ నెల 5 వ తారీకు లోపు తీసుకోవాలి. లేకపోతే ఆ నెలకు సంబందించి పెన్షన్ తీసుకునే సదుపాయం ఎవరి స్థాయిలో ఉండదు.ప్రభుత్వ సెలవులు కానీ, ఇతర సెలవులతో సంబంధం ఉండదు.
- ఏ నెలకు సంబందించిన పెన్షన్ ను ఆ నెల మాత్రమే తీసుకోవాలి. ఒకప్పటిలా 3 నెలల వరకు పెన్షన్ ను ఒకే సారి తీసుకునే అవకాశం లేదు.
- 3 నెలలకు మించి పెన్షన్ తీసుకోక పోతే పెన్షన్ తాత్కాలిక నిలుపుదల అవుతుంది. అప్పుడు సంబందించిన MC / MPDO వారికి లబ్ధిదారుడు అర్జీ పెటరుకొని పెన్షన్ పునః ప్రారంభించుకోవాలి.
- పెన్షన్ పంపిణి అయిన వెంటనే రెండు రోజుల లోపు పంచగా మిగిలిన నగదును వాలంటీర్ వారు సచివాలయం కు అందించవలెను. రెండు రోజులు దాటినచో రోజుకు 100/- చొప్పున జరిమాన పడుతుంది.
- పెన్షన్ పంపిణి చేయు సమయం లో లబ్ధిదారుని బయోమెట్రిక్ వేసిన తరువాత కొన్ని సార్లు Successful అవ్వక పోయిన ఆ పేరు లిస్ట్ లో కనిపించదు అలాంటప్పుడు ముందుగా మీ WEA వారిని కాంటాక్ట్ అయ్యి, Payment విజయవంతం అయితేనే నగదు ఇవ్వండి. లేకపోతే చివరలో ఆ పేరు Un Paid కిందనే ఉండి వారికి నగదు ఇచ్చే సందర్భం రావొచ్చు.
- పెన్షన్ కు సంబందించి దరఖాస్తు దారులు అప్లికేషన్ చేసుకున్న తరువాత ఇప్పడు సంవత్సరం లో రెండు సార్లు Sanction అవుతున్న విషయం గుర్తించాలి. అంటే డిసెంబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 31 లోపు దరఖాస్తు చేసుకునే వారికి జూన్ నెలలో పెన్షన్ అందుతుంది. అదే జూన్ 1 నుంచి నవంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకునే వారికి డిసెంబర్ నెల లో ఫైనల్ అయ్యింది Next Year జనవరి నుంచి పెన్షన్ అందుతుంది.
- పెన్షన్ పంపిణి రిపోర్ట్ తెలుసుకోటానికి అందరికి అందుబాటులో కేవలం జిల్లాల వారీగా మాత్రమే ఉంటుంది. అదే సచివాలయ పరిధిలో లబ్ధిదారుల వారీగా తెలుసుకోవాలి అంటే SS Pension WEA వారి లాగిన్ లో Others >>Reports >>Disbursement Report For Secretariat.
- పెన్షన్ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Service Request Status Check వద్ద PNS తో మొదలు అయ్యే పెన్షన్ దరఖాస్తు నెంబర్ ఎంటర్ చేస్తే దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది.
- ముందునుంచి రన్నింగ్ లో ఉన్న పెన్షన్ దారుని ప్రస్తుత స్టేటస్ తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Pension ID ను ఎంచుకొని Pension ID / Ration Card No / Sadarem Number ఎంటర్ చేసి జిల్లా,మండలం, పంచాయతీ, హాబిటేషన్ ను ఎంచికొని Submit చేస్తే స్టేటస్ ఓపెన్ అవుతుంది.
- పెన్షన్ పంపిణి సమయం లో ఐరిష్ ద్వారా పెన్షన్ పంపిణి చేయుటకు Integral RD Service మాత్రమే వాడాలి. Irish RD Service ను Uninstall చేయాలి.
- YSR Pension kanuka లో భాగం గా పెన్షన్ పంపిణి చేయిటకు అవసరం అయ్యే అప్లికేషన్ లు
- YSRPK Payment Online
- RBIS
- APCL FM220 RD
- Mantra RD Service
- Integra Irish RD
అన్ని అప్లికేషన్లు కొత్తగా వెర్షన్ లు కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
Leave a Reply