రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హౌసింగ్ ఫర్ అల్ అందరికీ ఇల్లు అనే సరికొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ పథకానికి సంబంధించినటువంటి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో అర్హతలు మరియు అప్లికేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనటం జరిగింది.
Housing For All Scheme Eligibility – హౌసింగ్ ఫర్ అల్ పథకానికి సంబంధించి అర్హతలు ఈ విధంగా ఉన్నాయి
ఈ పథకం కింద ఇంటి స్థలం పొందాలంటే కింద విధంగా అర్హతలు కలిగి ఉండాలి.
- సదురు లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు లేదా బిపిఎల్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి.
- లబ్ధిదారుడికి లేదా అతని కుటుంబ సభ్యులకి ఎవరికీ కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండరాదు.
- గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయి ఉండరాదు.
- సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
- లబ్ధిదారుని పేరు మీద కానీ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి మాగాణి అయితే రెండున్నర ఎకరం, మెట్ట భూమి అయితే ఐదు ఎకరాలు మించ రాదు. మెట్ట మాగాణి కలిపి కూడా అయితే ఎకరాలు మించ రాదు.
- అయితే గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లలో లేదా ఊరు బయట లేఅవుట్ల లో స్థలం కేటాయించిన వారికి అక్కడ ఉండటం లేదా ఇల్లు నిర్మించుకోవడం ఇష్టం లేనివారికి ప్రస్తుతం అప్లై చేసుకుని గతంలోది క్యాన్సిల్ చేసే అవకాశం కల్పించారు.
- ఇక గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా స్థలం కేటాయించబడి కోటి పరిధిలో ఉండి ఇంకా ప్రస్తుతం ఇంటి స్థలం కానీ ఇల్లు గాని లాబ్ధిదారుని పేరు మీద లేనిచో అటువంటి వారికి కూడా అవకాశం కల్పించారు.
ముఖ్య గమనిక: ఇంటి స్థలం కేటాయించిన రెండు సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. కుటుంబంలో మహిళల పేరు మీద ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది.
Housing For All Scheme Andhra Pradesh Application – అందరికీ ఇల్లు పథకానికి దరఖాస్తు విధానం
ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ వార్డు స్థాయిలో చేపట్టటం జరుగుతుంది.
- గ్రామా లేదా వార్డు స్థాయిలో ముందుగా దరఖాస్తులను ఆహ్వానిస్తారు.
- ఆ తర్వాత వీఆర్వో స్థాయిలో పరిశీలన ఉంటుంది.
- లబ్ధిదారుల ప్రాథమిక జాబితా గ్రామసభలను నిర్వహించి ప్రదర్శించడం జరుగుతుంది.
- గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులు లేదా అభ్యంతరాలను పరిశీలించి స్తుతి జాబితాను తయారు చేయడం జరుగుతుంది.
- తుది జాబితాను గ్రామ వార్డు సచివాలయాలలో ప్రదర్శిస్తారు.
- కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తారు.
Leave a Reply