ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాస్టర్ల గౌరవ వేతనాలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాస్టర్లకు గ తేడాది మే నెల నుంచి నవంబర్ నెల వరకు గల గౌరవ వేతనాన్ని చెల్లించనున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 8427 మంది పాస్టర్లకు నెలకు 5000 రూపాయలు చొప్పున లబ్ధి చేకూరనుంది.
ప్రస్తుతం పాస్టర్లకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే విడుదల అయింది. అయితే ఇమామ్ మౌజం లకు గౌరవ వేతనాన్ని ఎప్పుడు చెల్లిస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఆదాయం లేని మసీదుల్లోని ఇమామ్ లకు 10000 అలాగే మౌసములకు 5000 చొప్పున ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.
Leave a Reply